Overeating Meat : మాంసాహారం అతిగా తినేస్తున్నారా! అయితే జాగ్రత్త?

మాంసం ఎక్కువగా తినే వారు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.

Overeating Meat : మాంసాహారం అతిగా తినేస్తున్నారా! అయితే జాగ్రత్త?

Meat Lovers

Updated On : April 10, 2022 / 1:10 PM IST

Overeating Meat : మాంసాహారం తింటే మంచిదని శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయన్న మాట వాస్తమే అయినప్పటికీ దానిని అతిగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది మాంసాహారాన్ని వివిధ రకాల మసాలలతో రుచికరంగా వండుకుని తినేందుకు ఇష్టపడుతుంటారు. మాంసాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. అయితే దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇలా చేస్తే శరీరం బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మాంసాహారం ఎక్కువగా తినేవారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. మాంసాహారం వల్లే ఎక్కువ మంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. మాంసం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగుతుంది. అదికాస్త గుండెపోటు లాంటి ప్రమాదకరమైన పరిస్ధితులకు కారణమౌతుంది. మాసం అతిగా తినటం వల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారు. మొక్కల అధారిత ఆహారం బరువు తగ్గేందుకు దోహదపడితే, మాంసం బరువును వేగంగా పెంచేలా చేస్తుంది.

మాంసం ఎక్కువగా తినే వారు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పేగులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. పేగుల పనితీరుపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. గొడ్డు, మేక, పంది మాంసాలు అధికమోతాదులో తినేవారిలో ధమనుల్లో చెడు కొలెస్టరాల్‌ పేరుకుని గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్ద పేగు కాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాంసాహారాన్ని పరిమితంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. అతిగా తినే అలవాటు ఉన్నవారు మాత్రం ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం మంచిది.