Vegetarianism : జీర్ణక్రియలను వేగవంతం చేసే శాఖాహారం!
పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది.

Vegetarianism
Vegetarianism : శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శాకాహారంలో అనేక రకాల పోషకాలు శరీరానికి అందటమేకాక త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. చాలా మంది మంచి ఆహారం తీసుకోవాలన్న కోరికతో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల జీర్ణకోశ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. అయితే శాకాహారంలో లభించే పోషకాలు అన్నివయస్సుల వారికి సరిపోతాయి. ఆకుకూరలు, కాయగూరల్లో అన్ని పోషకాలు, ప్రొటీన్లు సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. మాంసాహారం తీసుకోవటం వల్ల ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది.
మొలకెత్తిన పెసర్లు, శనగలు వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది. సలాడ్ క్యారెట్, కీర, బీట్‌రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి.
పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం. అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టె తినడం మంచిది. ప్రతిరోజు మూడు లీటర్ల నీళ్లు తాగాలి. సమయానికి భోజనం చేయాలి. రాత్రి భోజనం ఎనిమిది గంటల కంటే ముందే ముగించాలి. వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలి.