Home » Food
రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండాలంటే రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం ముఖ్యం.
మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు మూడూ కలిపి లోపలకు వెళితే శరీరం శక్తి కొరకు పిండి, కొవ్వు పదార్థాలను వాడుకుని, శరీర నిర్మాణానికి, ఇతర పనులకు మాంసకృత్తులను ఉపయోగించుకుంటుంది.
ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా లభించటం వల్ల రక్త హీనత సమస్యలు తొలగిపోతాయి. చలికాలంలో గర్భిణీలు ఖర్జూరం తీసుకోవటం వల్ల పిండం ఎదుగుదలకు ఉపకరిస్తుంది.
వాకింగ్,సైకిలింగ్, వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామ ప్రక్రియల్లో నిరంతరం పిల్లలు పాల్గొనేలా వారిని తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలి.
స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి సి విటమిన్ కలిగిన పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తీసుకుంటే పీచుపదార్ధం అందుతుంది.
ఆస్తమా సమస్యతో బాధపడేవారికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. విరోచనాలతో బాదపడేవారు జీలకర్ర తీసుకుంటే తగ్గిపోతాయి.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఏడాదికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. తద్వారా కళ్ళను దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది.
విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు జున్ను, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి.
గాడిద పాలలోని పోషకాల ప్రాధాన్యతకు సంబంధించి ఇందులో పెద్ద మొత్తంలో బి, బి12, సి విటమిన్లతో పాటు న్యూట్రిన్లు ఉంటాయి. చంటి పిల్లలకు గాడిదపాలు తాగించటం ద్వారా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు దరి చేరవు.
కొలెస్ట్రాల్ ని తగ్గించు కోవాలంటే బచ్చలి తీసుకోవటం ఉత్తమైన మార్గం. కిడ్నీ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలన్నా బచ్చలి కూర తినటం మేలు.