Exercises : భవిష్యత్తు ఆరోగ్యం కోసం…. చిన్నవయస్సు నుండే వ్యాయామాలు

వాకింగ్,సైకిలింగ్‌, వాకింగ్‌, రన్నింగ్‌ వంటి వ్యాయామ ప్రక్రియల్లో నిరంతరం పిల్లలు పాల్గొనేలా వారిని తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలి.

Exercises : భవిష్యత్తు ఆరోగ్యం కోసం…. చిన్నవయస్సు నుండే వ్యాయామాలు

Exercise

Updated On : January 2, 2022 / 9:52 AM IST

Exercises : శరీరానికి వ్యాయామం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఆరోగ్యం కోసం, శరీరక దృఢత్వంకోసం, మానసిక ప్రశాంతత కోసం రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల ప్రయోజనం కలగుతుంది. వ్యాయామాల వల్ల కండరాలు బలోపేతం కావటంతోపాటు, రక్త ప్రసరణ మెరుగవుతుంది. క్రమంతప్పకుండా వ్యాయామాలు చేయటంలో వల్ల శరీరంలో రోగ నిరోధ శక్తి ఉత్తేజితమౌతుంది. అంతే కాకుండా దీర్ఘకాలిక సమస్యలైన మధుమేహం, ఊబకాయం, హృదయ సంభందిత సమస్యలను దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చిన్నవయస్సు నుండే వ్యాయామంపై చిన్నారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాల స్ధాయిలో ప్రత్యేక పాఠ్యాంశాల రూపంలో వ్యాయామ ప్రాముఖ్యత గురించి భోధించటంతోపాటుగా, క్రీడల ద్వారా, ఫిట్ నెస్ వ్యాయామాల చేయించటం ద్వారా వ్యాయామంపై వారిలో శ్రద్ధ పెరిగేలా చేయాలి. అలా చేయటం వల్ల చిన్న వయస్సు నుండే వారు ఆరోగ్యవంతమైన పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. పిల్లలను స్కూల్స్ లో చేర్పించి వ్యాయామాలు ఉపా ధ్యాయులు చూసుకుంటారని భావించడం పొరపాటు. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యాయామం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అవసరం. ఫిట్‌నెస్‌కు సంబంధించి వారిని ఎప్పుడూ గమనిస్తూ తగిన సూచనలు, సలహాలు ఇస్తుండాలి.

వాకింగ్,సైకిలింగ్‌, వాకింగ్‌, రన్నింగ్‌ వంటి వ్యాయామ ప్రక్రియల్లో నిరంతరం పిల్లలు పాల్గొనేలా వారిని తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలి. ఇలా చేయటం వల్ల పిల్లల జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగేందుకు అవకాశం ఏర్పడుతుంది. యుక్తవయస్సు వచ్చాక కూడా వ్యాయామాలు కొనసాగించటం ఉత్తమం. ఎందుకంటే మధ్యవయస్సుతోపాటు, వృధ్యాప్య దశ వచ్చేంత వరకు ఎలాంటి ఆరోగ్య రుగ్మతలు లేకుండా జీవితాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. యుక్తవయసులో ఉన్న వారు రోజుకు గంట, అంతకన్నా ఎక్కువ సేపు శారీరక శ్రమ చేయాలని నిపుణుల సూచిస్తున్నారు.

యుక్తవయసులో చేసే వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. యుక్తవయస్సు వారు ముఖ్యంగా గుండె వేగాన్ని పెంచే సైకిల్‌ తొక్కటం, డ్యాన్స్‌, పరుగు వంటి వ్యాయామాలు చేయాలి. బరువులు ఎత్తటం, ప్రషప్స్‌, బిగుతైన రబ్బరు బ్యాండ్లను లాగటం వంటి బలాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. కండరాలు బలోపేతం కావటానికి, జీవక్రియలు వేగవంతం కావటానికి ఈ వ్యాయామాలు తోడ్పడతాయి. ఈ వ్యాయామాలను ఇంట్లోనే చేసుకోవచ్చు. జిమ్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. పిల్లలు, యుక్త వయస్సు వారు రోజు వారి వ్యాయామాలు చేయటం వల్ల వారిలో తెలివితేటలు పెరగటంతోపాటు, చదువులోనూ ముందున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.