Nutritious Spinach : పోషకాల బచ్చలి…ఆరోగ్యానికి చేసే మేలెంతంటే?

కొలెస్ట్రాల్ ని తగ్గించు కోవాలంటే బచ్చలి తీసుకోవటం ఉత్తమైన మార్గం. కిడ్నీ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలన్నా బచ్చలి కూర తినటం మేలు.

Nutritious Spinach : పోషకాల బచ్చలి…ఆరోగ్యానికి చేసే మేలెంతంటే?

Bchali Kura

Updated On : December 31, 2021 / 3:55 PM IST

Nutritious Spinach : బచ్చలి ఆకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతోపాటుగా విటమిన్ ఎ,బి,సి, ఐరన్ క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బచ్చలిలో ఎక్కువ పీచు పదార్ధం ఉంటుంది. ఆహారంలో బచ్చలి కూరను బాగం చేసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కళ్ళు, మెదడు, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఇందులో ఉండే రెటినోల్ కంటి చూపును పెంచేందుకు తోడ్పడుతుంది. అంతే కాకుండా కేటరాక్ట్ మీ కంటి కండరాల బలహీనతని తగ్గిస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలకు చాలా మంచిది. బచ్చలికూర ఆహారంగా తీసుకోవటం వల్ల రక్త ప్రవాహాం మెరుగవుతుంది. రక్తపోటును తగ్గించటంలో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించటంలో సైతం ఇది అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు మెదడు డ్యామేజి కాకుండా కాపాడతాయి.

క్యాల్షియం సమృద్ధిగా ఉండే సిలోన్ బచ్చలిని క్రమం తప్పకుండా తినే వాళ్ళలో ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా సిలోన్ బచ్చలి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇందు లోని పీచు వల్ల బరువు తగ్గుతారట. రక్త హీనత సమస్యతో బాధపడే వారు బచ్చలి కూర తినటం వల్ల స్వల్పకాలంలో ఆసమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయటంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు వారానికి మూడుసార్లు ఈ కూరను తీసుకోవటం ఆరోగ్యపరంగా మంచిది.

కొలెస్ట్రాల్ ని తగ్గించు కోవాలంటే బచ్చలి తీసుకోవటం ఉత్తమైన మార్గం. కిడ్నీ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలన్నా బచ్చలి కూర తినటం మేలు. బచ్చలిలో ఉండే సాఫోనిన్ పదార్ధం క్యాన్సర్ వంటి సమస్యలను దరి చేరకుండా కాపాడుతుంది.

బచ్చలి కూరలో తక్కువ కేలరీలు , కొవ్వు నిష్పత్తి ఉంటుంది. ఇది బరువును తగ్గించటానికి దోహదం చేస్తుంది. మలబద్దకం సమస్యలను పరిష్కరించేందుకు ఉపకరిస్తుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా ఉండేలా చేస్తుంది. సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల భారి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.