Fiber : ఆరోగ్యానికి పీచు పదార్ధం…

స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి సి విటమిన్ కలిగిన పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తీసుకుంటే పీచుపదార్ధం అందుతుంది.

Fiber : ఆరోగ్యానికి పీచు పదార్ధం…

Fiber (1)

Updated On : January 1, 2022 / 5:54 PM IST

Fiber : పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శాకాహారంతోనే లభిస్తుంది. ప్రధానమైనవి నీటిలో కరిగేది, నీటిలో కరగనిది. నీటిలో కరిగే పీచు మృదువుగా ఉంటుంది. ఇది కూరగాయలు, విత్తనాలు, దంపుడు బియ్యం, బార్లీ, ఓట్స్‌ వంటి వాటితో లభిస్తుంది. నీటిని పీల్చుకోవటం ద్వారా మల పదార్థం ఏర్పడేలా, విసర్జన సాఫీగా సాగేలా చేస్తుంది. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్… ఇలాంటి పోషకాలన్నీ శరీరానికి తప్పనిసరిగా తగిన మోతాదుల్లో అవసరమే. ఆహారంలో ఇవన్నీ ఉన్నా, పీచుపదార్థాలు తగినన్ని లేకుంటే ఆరోగ్య పరంగా ఇబ్బందులు తప్పవు.

నీటిలో కరగని పీచు కాస్త గట్టిగా ఉంటుంది. ఇది విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాలతో లభిస్తుంది. కాలేయం నుంచి పేగుల్లోకి వచ్చే కొలెస్ట్రాల్‌ను ఇది పట్టేసుకుంటుంది. మలబద్ధకం, మొలలు, బుడిపెలు, క్యాన్సర్‌ వంటి పెద్దపేగు సమస్యల నివారణకు పీచు బాగా తోడ్పడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ కలవకుండా అడ్డుకోవటమే కాకుండా , దీన్ని ఒంట్లోంచి బయటకు వెళ్లగొడుతుంది. గోంగూర, బచ్చలి, మెంతి, కరివేప మొదలైన పచ్చని ఆకు కూరలలో పీచు అధికంగా వుంటుంది.

స్ట్రా బెర్రీలు, గూస్ బెర్రీలు, లేదా రాస్ప్ బెర్రీలు, బ్లూబెర్రీల వంటివి సి విటమిన్ కలిగిన పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని బఠాణీలు, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటివి తీసుకుంటే పీచుపదార్ధం అందుతుంది. ఫ్రెంచి బీన్స్, కిడ్నీ బీన్స్ వంటివి పీచు పదార్ధాన్ని కలిగి ఉంటాయి. బియ్యం, గోధుమ, జొన్న, పప్పులు, ఓట్లు పీచు అధికంగా వుండే పదార్ధాలు. మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో పీచు ఎక్కువ. కొన్ని ప్రత్యేక చికిత్సలలో తప్పించి, పీచును ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. ఆరోగ్యరక్షణకు తోడ్పడే గ్జెనో బయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, సైటో ఈస్ట్రోజన్లు పీచునుండి లభిస్తాయి.

రోజుకు ఒక కప్పు ఓట్‌ బ్రాన్‌ తీసకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది జీగురుద్రవంలా మారి జీర్ణాశయంలో ఎక్కువసేపు ఆహారం అక్కడే ఉండేలా చేస్తుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. పీచు అవసరం జీర్ణ వ్యవస్థ పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పెద్దగా ఉంటే ఎక్కువ పీచు కావాలి. రోజుకి 30-40 గ్రాముల పీచు పదార్ధం మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.