Jeera : జీర్ణశక్తిని పెంచే జీలకర్ర

ఆస్తమా సమస్యతో బాధపడేవారికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. విరోచనాలతో బాదపడేవారు జీలకర్ర తీసుకుంటే తగ్గిపోతాయి.

Jeera : జీర్ణశక్తిని పెంచే జీలకర్ర

Jeera

Updated On : January 1, 2022 / 3:50 PM IST

Jeera : వంటింటి వంట దినుసుల్లో జీలకర్ర కూడా ఒకటి. రుచి, సువాసన కోసం కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా దీనిని వేస్తుంటారు. వంటల్లో దీనిని కొద్దిపాటి మోతాదులో మాత్రమే వినియోగిస్తాం. అజీర్ణ సమస్యలతో బాధపడేవారు జీర వాటర్ ను తీసుకోవటం ద్వారా ఆ సమస్య నుండి త్వరగా విముక్తి పొందటం మనం చూస్తూనే ఉంటాం. ఆయుర్వేదంలో జీలకర్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు, గ్లూకోజ్‌, కొవ్వులు తేలికగా విడిపోయి.. జీర్ణమయ్యేందుకు తోడ్పడే ఎంజైమ్‌లు తయారయ్యేలా జీలకర్ర తోడ్పతుంది. శరీరానికి శక్తి వేగంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉండటంతోనే ప్రాచీన కాలం నుండి దీనిని మన పెద్దలు వినియోగిస్తూ వస్తున్నారు.

శరీరంలో కెలొరీలను కరిగించటంలో బాగా ఉపకరిస్తుంది. అంతే కాదు కొవ్వులు కరగటంతోపాటు, సులభంగా బరువు తగ్గవచ్చు. మొలల సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు కొద్ది మొత్తంలో జీలకర్ర తీసుకోవటం మంచిది. ఇందులో ఉండే పీచు పదార్ధం మలబద్ధకాన్ని నివారించి విరోచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు తప్పనసరిగా జీలకర్రను వినియోగించటం మంచిది. ఎందుకంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయటంలో జీలకర్ర ఉత్తమ పరిష్కారంగా చెప్పవచ్చు.

ఆస్తమా సమస్యతో బాధపడేవారికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. విరోచనాలతో బాదపడేవారు జీలకర్ర తీసుకుంటే తగ్గిపోతాయి. ఐరన్ లెవల్ జీలకర్రలో పుష్కలంగా ఉంటుంది. రక్త హీనత సమస్యతో బాధపడేవారు జీలకర్ర తీసుకోవటం వల్ల రక్త వృద్ధి చెందుతుంది. కడుపులో నొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం వల్ల ఫలితం ఉంటుంది.

ప్రతిరోజు ఉదయాన్నే జీలకర్ర నీరు తాగటం వల్ల కఫం కరిగి బయటకు వస్తుంది. వ్యాధికారమైన బ్యాక్టీరియాను చంపటంతోపాటు, జలుబు, దగ్గు, వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోజు వారి ఆహారంలో జీలకర్రను చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. శరీరం నుంచి విషతుల్య పదార్థాలను బయటకు వెళ్లగొట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. కాలేయం పనితీరు మెరుగుపడి జీర్ణశక్తి పెరుగుతుంది.

జీలకర్ర రోజు కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడటతోపాట, జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది.మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. జీకలర్ర కిడ్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చర్మ సంబంధిత ఎలర్జీలకు జీలకర్ర మంచి ఔషదంగా పనిచేస్తుంది.