Home » Hyderabad Meteorological Department
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద�
రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిచింది.
రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వానలు పడతాయని పేర్కొంది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారు జామున మొదలైన వర్షం సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయంగా మారాయి.
నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాల�