Heavy Rain Forecast : రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది.

Heavy Rains (7)
Telangana Heavy Rain : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి ఆవర్తనం, ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపుకు వంగి ఉందని తెలిపింది.
తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారు 15 డిగ్రీల ఎస్ అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవ వచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
Heavy Rain In China : చైనాలో భారీవర్షాలు, 15 మంది మృతి, పలువురి గల్లంతు
సిద్దిపేట జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మిరుదొడ్డి మండలం కూడవెల్లి వాగులోని చెక్ డ్యామ్ లు నిండి దిగువకు వరద నీరు ప్రవహిస్తోంది. దుద్దెడ శివారులో వరద నీటితో లోతట్టు ప్రాంతం జలమయంగా మారింది.
అత్యధికంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 16.3 సెంటీమీటర్లు, కొండపాకలో 13, మిరుదొడ్డిలో 12.6, ధూల్ మిట్టలో 12, సిద్దిపేట అర్బన్ లో 11.6, కొమురవెల్లిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.