Heavy Rain In China : చైనాలో భారీవర్షాలు, 15 మంది మృతి, పలువురి గల్లంతు
చైనా దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు, వరదల వల్ల 15 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో బుధవారం ఉదయం 7 గంటల సమయానికి సోమవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 15 మంది మరణించారు....

Heavy Rain In China
Heavy Rain In China : చైనా దేశంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు, వరదల వల్ల 15 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో బుధవారం ఉదయం 7 గంటల సమయానికి సోమవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 15 మంది మరణించారు. (Fifteen Killed, Many Missing)
Heavy Rains : మరో 3 రోజులు భారీ వర్షాలు
ఈ వరదల్లో మరో నలుగురు తప్పిపోయారని చైనా అధికారులు చెప్పారు. (Heavy Rain In China) భారీవర్షాల వల్ల నైరుతి చైనాలో అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాలు, వరదల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారులను ఆదేశించారు.
Ajit Pawar faction : మా వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది…అజిత్ పవార్ వర్గం ప్రకటన
అధికారులు ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని జిన్ పింగ్ సూచించారు. వరదల వల్ల రైల్వే వంతెన కూలిపోయింది. చైనాలోని సిచువాన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 4.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 85వేల మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షితప్రాంతాలకు తరలి వచ్చారు. మొత్తంమీద చైనా భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమైంది.