Ajit Pawar faction : మా వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది…అజిత్ పవార్ వర్గం ప్రకటన

మహారాష్ట్రలో ఎన్సీపీ సంక్షోభం మధ్య బుధవారం శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.తమ వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నందున పార్టీ పేరు, గుర్తు తమకే ఇవ్వాలని అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే అనిల్ పాటిల్ కోరారు....

Ajit Pawar faction : మా వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది…అజిత్ పవార్ వర్గం ప్రకటన

NCP Rival Meetings

Ajit Pawar faction : మహారాష్ట్రలో ఎన్సీపీ సంక్షోభం మధ్య బుధవారం శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో పాటు పోటాపోటీగా రెండు వర్గాలు సమావేశానికి హాజరు కావాలంటూ విప్ లు జారీ చేసుకున్నాయి. రెండు వర్గాల కీలక భేటీలకు ముందు ముంబయి నగరంలో పోస్టర్ వార్ కూడా మొదలైంది. (NCP Rival Meetings) తన అనుమతి లేకుండా తన ఫొటోలు ఉపయోగించకూడదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదేశాలు జారీ చేసినా అజిత్ పవార్ వర్గం క్యాంపు సమావేశపు వేదికపై శరద్ పవార్ ఫొటో ఉపయోగించారు.

Issues Whip to MLAs : మహారాష్ట్ర ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య విప్ వార్

తమ వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నందున పార్టీ పేరు, గుర్తు తమకే ఇవ్వాలని అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే అనిల్ పాటిల్ కోరారు. (support of 40 MLAs ahead of rival meetings) బాంద్రాలోని సమావేశానికి అజిత్ పవార్ రాగానే మీ వెంట మేమున్నాం అంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అజిత్ పవార్ శిబిరానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ముంబై సమావేశ స్థలానికి చేరుకున్నారని సమాచారం.

Bihar minister : నా ప్రాణాలకు ముప్పు ఉంది…పోలీసులకు ఫిర్యాదు చేసిన బీహార్ మంత్రి

ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నాయకులు ప్రఫుల్ పటేల్, ఛుగన్ భుజబల్ ముంబయిలోని కొత్త కార్యాలయంలో పార్టీ సమావేశానికి వచ్చారు. ముంబయి సమావేశ వేదిక వద్ద అజిత్ పవార్‌కు ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, సునీల్ తట్కరే స్వాగతం పలికారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఇతర పార్టీల నేతలతో కలిసి మెట్ బాంద్రాలో ఎన్సీపీ జెండాను ఆవిష్కరించారు.

PM Modi Tiffin Pe Charcha : వరణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ టిఫిన్ పే చర్చా సమావేశం

అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే సమావేశానికి ఇంకా చేరుకోని ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా మరో వైపు శరద్ పవార్ కాసేపట్లో ఎన్సీపీ కార్యాలయమైన వైబీ సెంటర్‌కు చేరుకోనున్నారు. శరద్ పవార్ కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ కార్యకర్తలు కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్సపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కిరణ్ లహ్మతే, అశోక్ పవార్, రోహిత్ పవార్, దేవేంద్ర భుయార్, రాజేంద్ర షింగ్నే, అనిల్ దేశ్‌ముఖ్ ముంబయిలోని వైబీ చవాన్‌ఆఫీసుకు చేరుకున్నారు.