PM Modi Tiffin Pe Charcha : వరణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ టిఫిన్ పే చర్చా సమావేశం

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వరణాసి నగర పర్యటన సందర్భంగా మోదీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యకర్తలతో కలిసి టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు....

PM Modi Tiffin Pe Charcha : వరణాసిలో బీజేపీ కార్యకర్తలతో మోదీ టిఫిన్ పే చర్చా సమావేశం

PM Modi Tiffin Pe Charcha

PM Modi Tiffin Pe Charcha : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వరణాసి నగర పర్యటన సందర్భంగా మోదీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యకర్తలతో కలిసి టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. (PM Modi take part in Tiffin Pe Charcha) ప్రధాని మోదీతో జరగబోయే కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు సొంతంగా టిఫిన్ తీసుకువస్తారని బీజేపీ నేతలు చెప్పారు.

MP Police Arrest : గిరిజనుడిపై మూత్రం పోసిన బీజేపీ నేత అరెస్ట్

బీజేపీ కార్యకర్తలు మోదీతో కలిసి టిఫిన్ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఛాయ్ పే చర్చా కార్యక్రమం పెట్టగా ఈ సారి టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాలని మోదీ నిర్ణయించారు. వారణాసి, జౌన్‌పూర్, ఘాజీపూర్, చందౌలీ, మిర్జాపూర్, భదోహి అనే ఆరు జిల్లాల నుంచి 14వేల మంది వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను మోదీ ర్యాలీకి ఆహ్వానించారు.

Issues Whip to MLAs : మహారాష్ట్ర ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య విప్ వార్

వారణాసిలో మోదీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.ప్రధానమంత్రి స్వనిధి పథకం, గ్రామీణ గృహనిర్మాణ పథకం, ఆయుష్మాన్ కార్డ్ స్కీమ్‌తో సహా ప్రతి మూడు పథకాల నుంచి ముగ్గురు లబ్ధిదారులకు మోదీ సర్టిఫికెట్లు అందజేయనున్నారు. ఈ మూడు స్కీమ్‌లలో ప్రతి 10 మంది లబ్ధిదారులతో కూడా ప్రధాని మోదీ సంభాషించనున్నారు.