Telangana Rain : రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.

Telangana Rain : రానున్న మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

Telangana Rain (2)

Updated On : July 1, 2023 / 8:17 PM IST

Rain In Telangana : నైరుతిరుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు వర్ష సూచన చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల నేడు(శనివారం), రేపు(ఆదివారం) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

ఎల్లుండి(సోమవారం) ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.

Heavy Rains: గుజరాత్‭ను ముంచేసిన భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 9 మంది మృతి

జులై 4 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.