Southwest Monsoon: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన

ఆదివారం వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి విస్తరణ‌తో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

Southwest Monsoon: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rains

Updated On : June 24, 2023 / 10:24 AM IST

Telangana: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికి ఉత్తర తెలంగాణ‌లోని నిజామాబాద్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఆదివారం వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా నైరుతి వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి విస్తరణ‌తో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతం‌లో ఉపరితల ఆవర్తనంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

Southwest Monsoon : ఖమ్మం జిల్లాను తాకిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో 7.6 కిమీ ఎత్తున నైరుతి దిశగా ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో శుక్రవారం రాత్రి నుండి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్‌లో అత్యధికంగా 96.5 మిల్లీ మీటర్లు, సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ 66.8 మి.మీ, తోగుట 57.3 మి.మీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 56.5 మి.మీ, ఖమ్మం జిల్లా మధిరలో 54.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

Southwest Monsoon : ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్

అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. చాలా రోజులుగా ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటే బెంబేలెత్తిపోయారు. తాజాగా నైరుతి పవనాలు తెలంగాణలో వేగంగా విస్తరిస్తుండటంతో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండల నుంచి ఊరట చెందారు.