Home » TDP Mahanadu 2023
"మహానాడు వేదికగా రేపు యువతకి శుభవార్త చెబుతాం" అని లోకేశ్ చెప్పారు.
అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా? అప్పుడు చెప్పులు విసిరి ఇప్పుడు పాదపూజలా? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు పొడగడ్తలా?
కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేశాడంటూ ఆరోపించారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకుని ప్రజల్ని నట్టేట ముంచారంటూ విమర్శించారు.
మహానాడు ద్వారా మళ్ళీ చరిత్ర తిరగరాసే రోజు ఈ రోజు. పార్టీ సింబల్ సైకిల్,సైకిల్ అంటూ సామాన్యుడి వాహనం. ఇప్పుడు అదే సైకిల్ ని ఎలక్ట్రికల్ సైకిల్ చేస్తున్నా.సంపద సృష్టించడం, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు చేరువ చేసిన పార్టీ టీడీపీ.
మహానాడులో సందడి వాతావరణం నెలకొంది. మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి సభా ప్రాంగణం వరకు పసుపు మయంతో రహదారి నిండిపోయింది.
రెండు రోజులు మహానాడులో భాగంగా శనివారం ప్రతినిధుల సభ జరుగుతుంది. మహానాడు నుండి ఎన్నికల శంఖారావాన్ని టీడీపీ మోగించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తారు.
రాజమహేంద్రవరంలో 1993లో మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించింది. ఆ తరువాత సంవత్సరం 1994 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30ఏళ్ల తరువాత మరోసారి రాజమహేంద్రవరంలో ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహించనుంది.
అమరావతి ఎలక్ట్రానిక్ సిటీలో 26 జిల్లాల యువతకు వచ్చే 3.80 లక్షల ఉద్యోగాలు పోగొడుతున్నారంటూ మరో తీర్మానం చేయనున్నారు.
సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగనుంది. మహానాడు అజెండాతో పాటు రానున్న రోజుల్లో పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను పొలిట్ బ్యూరో ఖరారు చేయనుంది.
Nara Lokesh : యువగళం పాదయాత్ర ప్రారంభించాక తొలిసారి విజయవాడకు వచ్చారు లోకేశ్.