Kottu Satyanarayana : చంద్రబాబుకు హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అవార్డులు ఇవ్వాలి : కొట్టు సత్యనారాయణ
అప్పుడు అవమానించి ఇప్పుడు సన్మానాలా? అప్పుడు చెప్పులు విసిరి ఇప్పుడు పాదపూజలా? వెన్నుపోటు పొడిచి ఇప్పుడు పొడగడ్తలా?

Chandrababu ..kottu satyanarayana
Kottu Satyanarayana – Chandrababu : టీడీపీ మహానాడు సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. డిప్యూటీ సీఎం, మంత్రి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. మహానాడులో చంద్రబాబుకు హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అనే అవార్డులు ఇవ్వాలని తీర్మానం చేయాలి అంటూ సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీనీ, పార్టీ గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు.
ఇదేం కర్మ అనే పేరుతో 13 మందిని, గోదావరి పుష్కరాల్లో 33 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు.. మళ్ళీ అదే రాజమండ్రీ లో మహానాడు పెట్టి ఎంత మందినీ పొట్టనపెట్టుకుంటారో అని జనం భయ పడుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. మహానాడు కు 15 లక్షల మంది వస్తారు అని టీడీపీ నాయకులు డబ్బాలు కొట్టుకుంటున్నారని.. మహానాడుకు కనీసం 2 లక్షల మంది కూడా రారు అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయ కుట్రకోసం మహానాడుకు జనసమీకరణ చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు గోదావరి జిల్లా ప్రజలనే పొట్టన పెట్టుకుంటున్నారని, తుని ఘటనలో రత్నచల్ రైలును తగలపెట్టించింది చంద్రబాబేనని ఆరోపించారు కొట్టు. కానీ నీ ఆ ఘటనను కాపులకు అంటగట్టారని కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తుని ఘటనలో కేసులు కొట్టేయడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ జనాల ప్రాణాలు కోల్పోతున్నారని.. ఆనాడు ఎన్టీఆర్ పై చెప్పులు చేసి ఈనాడు పాదపూజ చేస్తున్నారు అంటూ విమర్శించారు కొట్టు సత్యనారాయణ.