Home » Ys Jagan Mohan Reddy
వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. లేదంటే ఏపీ ప్రజలకు బతుకు లేదు. ఈ ఎన్నికలు టీడీపీ, జగన్ మధ్య కాదు.. 5కోట్ల మంది ప్రజలకు, జగన్ కి మధ్య జరుగుతున్న ఎన్నికలివి.
పవన్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు. రాజకీయాలకు పనికిరాడు. చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలని చూస్తున్నారు. సిట్టింగ్ లకు సీట్లు లేవని కొందరు మా పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు.
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
అధికార వైసీపీలో మార్పులు చేర్పులు గోదావరి తీరంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలలో మొత్తం 34 సీట్లు ఉండగా.. 6 చోట్ల ప్రస్తుతానికి సిట్టింగ్ లను మార్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని నేర్చుకున్న పాఠం ఏంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతాం అంటూ ప్రతిజ్ఞ చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ లో ఈ లక్షణాలు ఉన్నాయా?
చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది.
మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు పేర్నినాని. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.