5G Official in India : ఇండియాకు 5G వచ్చేసిందోచ్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు 5G సర్వీసులు ఎప్పటినుంచంటే?

5G is Official in India : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5G నెట్‌వర్క్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 5G సర్వీసులు అధికారికంగా అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో శనివారం (అక్టోబర్ 1న) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్‌లో 5G సర్వీసులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారికంగా ప్రారంభించారు.

5G Official in India : ఇండియాకు 5G వచ్చేసిందోచ్.. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ యూజర్లకు 5G సర్వీసులు ఎప్పటినుంచంటే?

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

5G Official in India : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 5G నెట్‌వర్క్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో 5G సర్వీసులు అధికారికంగా అందుబాటులోకి వచ్చేశాయి. దేశంలో శనివారం (అక్టోబర్ 1న) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2022 ఈవెంట్‌లో 5G సర్వీసులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధికారికంగా ప్రారంభించారు.

5G లాంచ్ ఈవెంట్ సందర్భంగా.. రిలయన్స్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani), భారతీ ఎయిర్‌టెల్‌ (Bharati Airtel)కు చెందిన సునీల్ మిట్టల్, VI కుమార్ మంగళం బిర్లా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లందరూ దేశంలోని సంబంధిత 5G సర్వీసులకు సంబంధించి కొన్ని వివరాలను షేర్ చేశారు. రిలయన్స్ భారత మార్కెట్లో సరసమైన 5G సర్వీసులను అందించనుంది.

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

డిసెంబర్ 2023 నాటికి జియో 5G సర్వీసులను అన్ని జిల్లాలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు.. ఎయిర్‌టెల్ (Airtel) కూడా 5G సర్వీసులను ప్రారంభ దశలో 8 నగరాల్లో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా (Vi) మాత్రం 5G సర్వీసుల ప్రారంభంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, అతి త్వరలో 5Gని సర్వీసులను లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

టెల్కోలు 5G సర్వీసుల వినియోగంపై ఇంకా కచ్చితమైన ధర వివరాలను అందించలేదు. IMC 2022లో అక్టోబర్ 1 నుంచి భారత మార్కెట్లో 5G అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. టెలికం కస్టమర్లు అందరికి (ఇంకా) 5G సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఎంపిక చేసిన ప్రాంతాల్లో టెల్కోలు కనెక్టివిటీ ఆప్షన్ టెస్టింగ్ చేసే అవకాశం ఉంది.

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

రిలయన్స్ జియో 5G  (Reliance Jio 5G) :
IMC 2022 ఈవెంట్ సందర్భంగా రిలయన్స్ చైర్‌పర్సన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ టెలికం నెట్‌వర్క్ అందించలేని హై క్వాలిటీ, అత్యంత సరసమైన ధరలను అందించడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని తెలిపారు. టెలికాం ఆపరేటర్ డిసెంబర్ 2023 నాటికి అన్ని జిల్లాలకు 5Gని అందిస్తామని వెల్లడించింది. అంతకుముందు, Jio తన 5G దీపావళి నాటికి (అక్టోబర్ 23-24 తేదీలలో) అందుబాటులోకి వస్తుందని జియో పేర్కొంది. జియో 5G సర్వీసులను మొట్టమొదటగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలలో లాంచ్ చేయనన్నట్టు కూడా తెలిపింది.

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

5G is official in India, here is when Jio, Airtel and Vodafone users will get 5G

భారతీ ఎయిర్‌టెల్ 5G (Airtel 5G Services) : భారతీయ ఎయిర్‌టెల్ (Airtel) భారతీ చైర్‌పర్సన్ సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. ఎయిర్‌టెల్ 5G సర్వీసులు ప్రారంభ దశలో 8 భారతీయ నగరాల్లో ఢిల్లీ, వారణాసి, ముంబై మరిన్ని నగరాల్లో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు అక్టోబర్ 1 (శనివారం) నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. అయితే 5G సర్వీసులకు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది.

Vi 5G : (వోడాఫోన్ ఐడియా) :
భారత్‌లోకి 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. భారతీయ టెలికం దిగ్గజాలు పోటాపోటీగా దేశంలో 5G సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. అయితే ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ 5G సర్వీసులు ఈ రోజు నుంచే అందుబాటులోకి వస్తాయని ప్రకటించగా.. Vi (గతంలో వోడాఫోన్ ఐడియా) ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. IMC 2022లో కస్టమర్లందరికీ తన 5G సర్వీసులను మెరుగుపరచాలని కంపెనీ పేర్కొంది. Vi 5G సర్వీసుల కోసం OnePlusతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5G in India: 5జీ లింక్ ఉపయోగించి.. స్వీడన్ నుంచి ఢిల్లీకి కారు నడిపిన ప్రధాని మోదీ