5G Services in India : భారత్‌కు 5G వచ్చేస్తోంది.. మీ స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేసుకోండి.. కొత్త ఫోన్ కొనాలా? 5G సిమ్ తీసుకోవాలా? పూర్తి వివరాలు మీకోసం..!

5G Services in India : అతి కొద్దిరోజుల్లో భారత మార్కెట్లోకి 5G వచ్చేస్తోంది. వచ్చే అక్టోబర్‌లోనే 5G సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాబోయే వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ 5G సిగ్నల్ బార్‌తో కనిపించనుంది. ఇప్పటివరకూ 4G వరకు మాత్రమే ఉండగా.. ఇకపై స్మార్ట్ ఫోన్లలో 5G సింబల్ కనిపించనుంది.

5G Services in India : భారత్‌కు 5G వచ్చేస్తోంది.. మీ స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేసుకోండి.. కొత్త ఫోన్ కొనాలా? 5G సిమ్ తీసుకోవాలా? పూర్తి వివరాలు మీకోసం..!

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India : అతి కొద్దిరోజుల్లో భారత మార్కెట్లోకి 5G వచ్చేస్తోంది. వచ్చే అక్టోబర్‌లోనే 5G సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాబోయే వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ 5G సిగ్నల్ బార్‌తో కనిపించనుంది. ఇప్పటివరకూ 4G వరకు మాత్రమే ఉండగా.. ఇకపై స్మార్ట్ ఫోన్లలో 5G సింబల్ కనిపించనుంది. గత జూలైలో స్పెక్ట్రమ్ విజయవంతంగా ముగిసిన అనంతరం భారతీయ టెలికాం ఆపరేటర్లు 5G ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు(India Mobile Congress conference)లో ప్రధాని నరేంద్ర మోదీ 5G సర్వీసులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ప్రకటించారు. రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్ టెల్ (Airtel) ఈ 5G సర్వీసులను ప్రారంభించనున్నాయి. వోడాఫోన్ ఐడియా (Vi) 5G సర్వీసులను ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉంది.

ముందుగా మెట్రో నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఈ 5G సర్వీసులు టెలికం వినియోగదారులందరికి అందుబాటులోకి వస్తాయా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింద. వాస్తవానికి 5G సర్వీసులు భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో టెలికం వినియోగదారుల్లో 5G సర్వీసుల వినియోగంపై గందరగోళం నెలకొంది. 5G సర్వీసులు అందుబాటులోకి వస్తే.. కొత్త ఫోన్ తప్పనిసరిగా కొనాల్సిందేనా? అలా అయితే ఎలాంటి ఫోన్ తీసుకోవాలి? కొత్త సిమ్ కార్డ్ కూడా తీసుకోవాల్సిందేనా? అనేక సందేహాలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. 5G సర్వీసులకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.

4G ఉండగా.. 5G అవసరమా? :

మీకు ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ కావాలా? అయితే మీరు అప్‌గ్రేడ్ కావాల్సిందే. స్పీడ్ ఇంట‌ర్నెట్ ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేయవచ్చు. అదే 4G సర్వీసుల్లో పరిమితంగా మాత్రమే ఉంటుంది. 5G సర్వీసుల్లో అత్యంత వేగంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే హై – గ్రాఫిక్స్ గేమ్స్ ప్లే చేసుకోవచ్చు. హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సర్వీసులకు ఎలాంటి బఫరింగ్ లేకుండా వేగంగా యాక్సస్ చేసుకోవచ్చు. అందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5G నెట్‌వర్క్ ద్వారా పొందవచ్చు. భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కన్జ్యూమర్ సర్వే ప్రకారం.. హైస్పీడ్ నెట్‌వర్క్ మొబైల్ సర్వీసులను మరింత వేగవంతం చేస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు.

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India _ Your Smartphone will Support to 5G Network

5G సర్వీసుల కోసం భారతీయ ఆపరేటర్లు వేలంలో పొందిన స్పెక్ట్రమ్ C-బ్యాండ్, సబ్-1GHz అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. 5G మార్కెట్లలోని అధ్యయనం ప్రకారం.. ప్రస్తుత 4G కన్నా 5G స్పీడ్ 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది. ఒకవేళ మీరు 5G సర్వీసులను పొందాలంటే ఎలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయో తప్పక తెలుసుకోండి.

2016లో 4G నెట్‌వర్క్‌ ప్రారంభంలోనూ రిలయన్స్ జియో డేటా సంచలనానికి తెరలేపింది. సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఫ్రీగా అందించింది. 4G మార్కెట్ లో జియో అత్యధిక మార్కెట్ వాటాను దక్కించుకుంది.  5G సర్వీసులను ప్రారంభించేందుకు కూడా భారతీయ ఆపరేటర్లు పోటాపోటీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జియో ‘True 5G’ సర్వీసులను అందించేందుకు రెడీగా ఉన్నామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు.

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India _ Your Smartphone will Support to 5G Network

మీ ఫోన్ 5Gకి సపోర్టు చేస్తుందా? లేదో చెక్ చేయండిలా :

మీ ఫోన్ 5G సపోర్ట్ చేస్తుందా లేదో ముందుగా తెలుసుకోవాల్సి ఉంది. మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ (Phone Network Settings)ను లేదా మీ సిమ్‌కార్డ్‌ (SIM Card)కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్ వర్క్ (Preferred Network Type)ను చెక్ చేయండి. ఒకవేళ మీ ఫోన్ 5G స్టేటస్ సూచిస్తే.. మీ ఫోన్ 5G సపోర్ట్ చేస్తుందని అర్థం.  ఓక్లా మార్కెట్ సర్వే ప్రకారం.. భారతీయ వినియోగదారులు 5G ఫోన్ ఉపయోగిస్తూ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ టెస్టింగ్ చేస్తున్నారు. 5G అప్‌గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

కొత్త మొబైల్ రీచార్జ్ ప్లాన్ ద్వారా కూడా యాక్సస్ చేసుకోవచ్చునని సర్వే చెబుతోంది. 5G ఖరీదైన ఫోన్లలోనే కాదు.. మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా సాధారణ ఫీచర్‌గా ఉంటోంది. మీ మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో మీకు 5G స్టేటస్ లేకపోతే.. మీ ఫోన్ 5G సపోర్ట్ చేయదని గుర్తించాలి. మీరు చేయాల్సిందిల్లా.. 5G సపోర్టు చేసే కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సిందే.

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India _ Your Smartphone will Support to 5G Network

మార్కెట్లో.. ఏయే బ్రాండ్ల 5G ఫోన్లు ఉన్నాయంటే? :

భారత మార్కెట్లో అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీల 5G సపోర్టెడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ధరల్లో ఆపిల్ ఐఫోన్లు (Apple iphones), శాంసంగ్ (Samsung), షావోమి (Xiaomi), పోకో (Poco), రియల్‌మి (Realme), వివో (Vivo) వంటి బ్రాండ్లు 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఉన్నాయి. 5G చిప్‌సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్‌కమ్ వంటి వ్యూహాత్మక ఒప్పందాలతో OEM చాలా తక్కువ ధరకే అంటే.. రూ. 15వేలకే 5G స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. రియల్‌మి (Realme) వంటి బ్రాండ్లు రూ.10వేల లోపుగానే 5G ఫోన్లను అందించేందుకు రెడీగా ఉన్నాయి. 5G స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసేముందు వినియోగదారులు ఒకటికి పదిసార్లు ఏయే ఫీచర్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India _ Your Smartphone will Support to 5G Network

5G ఫోన్ తప్పక కొనాల్సిందేనా? :
అక్టోబర్ నుంచి భారతదేశ వ్యాప్తంగా 5G సర్వీసులు అందుబాటు రానున్నాయి. ప్రారంభంలో మెట్రో నగరాల్లోనే 5G సర్వీసు లభ్యం కానుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులలో హైస్పీడ్ ఇంటర్నెట్ పొందాలంటే తప్పకుండా 5G ఫోన్ ఉండాల్సిందే. 5G ఫోన్ కొనుగోలు చేయడం ఎంత అవసరం అనేది తెలుస్తుంది.

అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా ఇతర నగరాల్లో 5G కనెక్టివిటీ తర్వాతి రోజుల్లో అందుబాటులోకి రానుంది. దేశంలో 5G మొదటగా వచ్చే 13 నగరాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటించింది. పెద్ద పెద్ద నగరాల్లో ఈ 5G కవరేజీ అందుబాటులోకి రానుంది. టాప్ 100 భారతీయ నగరాల్లో 5G కవరేజ్ ప్లానింగ్ పూర్తి అయిందని జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ Jio 5G Services కవర్ చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India _ Your Smartphone will Support to 5G Network

5G ఫోన్ కొనే ముందు అసలు ఏం చూడాలంటే? :

కొత్త 5G ఫోన్ కొనేటప్పుడు.. 5G సపోర్టు చేస్తే సరిపోదు. ఇంకా ఎన్నో అంశాలు ఉంటాయి. వాటి విషయంలోనూ అవగాహన ఉండాలి. 5G ఫోన్‌లో ఏ విధమైన 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుందో చెక్ చేసుకోవాలి. ఆ డేటా ఫోన్ రిటైల్ బాక్స్‌పై ఉంటుంది. 5G స్పెక్ట్రమ్‌లో 3 బ్యాండ్స్ ఉంటాయి. వాటిలో ముందుగా లో – బ్యాండ్ (Low – Band), మిడ్ -బ్యాండ్ (Mid-Band), హై- బ్యాండ్ (High-Band). అయితే లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్ కలిగి ఉంటుంది. దీన్నే n28గా కూడా పిలుస్తారు.

మిడ్ బ్యాండ్ అనేది 3500MHz కలిగి ఉంటుంది. దీన్నే n78 అని అంటారు. ప్రతీ 5G ఫోన్ n78ను సపోర్ట్ చేస్తుంది. ఖరీదైన ఫోన్లలోనే n28 సపోర్టు చేస్తుంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5G సర్వీసులకు సపోర్టు చేస్తుంది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే ఈ బ్యాండ్ అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటుంది. దీన్ని mmWaveగా, n258గా అంటారు. కొద్ది ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే.. mmWave కనెక్టివిటీ అనేది 5G ఆరంభంలోనే యూజర్లకు అందుబాటులో ఉండకపోవచ్చు.

5G Services in India _ Your Smartphone will Support to 5G Network, Do need 5G SIM card to use 5g services, Here is the Full Details

5G Services in India _ Your Smartphone will Support to 5G Network

5G స్పీడ్ ఎంత ఉండొచ్చుంటే? :

ప్రపంచవ్యాప్తంగా 5G నెట్‌వర్క్ సర్వీసులు యూజర్లకు 1Gbps కన్నా హైస్పీడ్ అందిస్తాయి. భారతీయ టెల్కోలు 4G కన్నా అధికంగా డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ అందించనున్నాయి. 5G స్పీడ్ అనేది మీ ఆపరేటర్‌పైనే కాదు.. లొకేషన్‌పై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.

5G ఫోన్‌లో 4G సిమ్ సపోర్టు చేస్తుందా? :
మీ ప్రస్తుత 4G SIM card కొత్త 5G ఫోన్‌లోనూ పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS, వాయిస్ కాలింగ్ 4G, 5G సర్వీసులను పొందొచ్చు. భారతీయ టెల్కోలు NSA 5G టెక్నాలజీని అవలంభించాయి. దాంతో ప్రస్తుత 4G సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి సపోర్టు ఇస్తుంది. ఈ ప్రమాణం 2G, 3G, 4G, 5G సర్వీసులకు సపోర్టు చేసేలా ఉంటుంది. లేదంటే.. మీ 4G సిమ్ ను 5Gకి పోర్ట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. కొత్త 5G SIM తీసుకుంటే మరీ బెటర్.. 5G సర్వీసులను మరింత వేగంగా పొందడానికి అనుకూలంగా ఉంటుంది.