Airtel 5G Services : మీరు ఉండే ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5G ఉన్నా.. మీ ఫోన్‌లో యాక్సస్ చేయలేక పోతున్నారా? అసలు కారణం ఏంటో తెలుసా?

Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) 5G కవరేజీని దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో 5Gని ప్రారంభించినప్పటి నుంచి టెలికాం ఆపరేటర్ ఇప్పటికే ఢిల్లీ, ఇంఫాల్, అహ్మదాబాద్, పూణెతో సహా 20 కన్నా ఎక్కువ నగరాల్లో 5Gని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Airtel 5G Services : మీరు ఉండే ప్రాంతంలో ఎయిర్‌టెల్ 5G ఉన్నా.. మీ ఫోన్‌లో యాక్సస్ చేయలేక పోతున్నారా? అసలు కారణం ఏంటో తెలుసా?

Airtel 5G available in your area but you still can't use it on your phone

Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) 5G కవరేజీని దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో 5Gని ప్రారంభించినప్పటి నుంచి టెలికాం ఆపరేటర్ ఇప్పటికే ఢిల్లీ, ఇంఫాల్, అహ్మదాబాద్, పూణెతో సహా 20 కన్నా ఎక్కువ నగరాల్లో 5Gని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎయిర్‌టెల్ 5వ జనరేషన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది.

టెలికాం ఆపరేటర్ రాబోయే 2-3 సంవత్సరాలలో 5G పాన్-ఇండియా లాంచ్ కోసం లక్ష్యంగా పెట్టుకుంది. 5G సదుపాయం ఉన్న నగరాల్లో నివసిస్తున్న ఎయిర్‌టెల్ యూజర్లు 4Gతో పోలిస్తే.. వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులను పొందవచ్చు. Airtel కస్టమర్లు ఇప్పుడు అల్ట్రాఫాస్ట్ నెట్‌వర్క్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. ప్రస్తుత 4G స్పీడ్ కన్నా 20-30 రెట్లు ఎక్కువ వేగాన్ని పొందవచ్చునని భారతీ ఎయిర్‌టెల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ CEO సుజయ్ చక్రబర్తి ప్రకటనలో తెలిపారు. Airtel 5G ప్లస్ అందుబాటులో ఉన్న నగరాల జాబితా మీకోసం అందిస్తున్నాం..

Airtel 5G నగరాల ఫుల్ లిస్టు :

* Delhi
* Mumbai
* Chennai
* Bengaluru
* Hyderabad
* Siliguri
* Nagpur
* Varanasi

Read Also : Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. కొత్తగా మరో 2 నగరాల్లోకి.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

* Panipat
* Gurugram
* Guwahati
* Patna
* Lucknow
* Shimla
* Imphal
* Ahmedabad
* Vizag
* Pune
* Indore

Airtel 5G లభ్యతను ఎలా చెక్ చేయాలంటే? :
5G ప్రారంభించిన సందర్భంగా ఎయిర్‌టెల్ టెల్కో దశలవారీగా 5Gని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. మీ సిటీలో నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రతి స్ట్రీట్, ఏరియాలో లైవ్ టెలిక్యాస్ట్ చేసేందుకు కొంత సమయం పడుతుంది. మీ ప్రాంతంలో నెట్‌వర్క్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయవచ్చు. వినియోగదారులు Airtel థాంక్స్ యాప్‌లోకి లాగిన్ చేయడం ద్వారా 5G నెట్‌వర్క్ లభ్యతను చెక్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లకు ఒకసారి 5G నెట్‌వర్క్ కూడా అందుబాటులోకి వస్తే.. 5G-రెడీ స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ చేయవచ్చు.

Airtel 5G available in your area but you still can't use it on your phone

Airtel 5G Services : Airtel 5G available in your area but you still can’t use it on your phone

అదనంగా, 5G నెట్‌వర్క్ ఇప్పటికే ఉన్న 4G SIMకి ఆటోమాటిక్‌గా కనెక్ట్ అవుతుంది. వినియోగదారులు కొత్త 5G SIMని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఎయిర్‌టెల్ 5Gని వాణిజ్యపరమైన ఉపయోగం కోసం అధికారికంగా రిలీజ్ చేస్తోంది. Jio మాదిరిగా కాకుండా, టెలికాం బీటా టెస్టింగ్‌లో 5Gని ప్రారంభించింది. వెల్‌కమ్ ఆఫర్ ఆహ్వానాన్ని అందుకున్న వినియోగదారులు మాత్రమే కొత్త నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చు.

Airtel 5Gకి ఎలా కనెక్ట్ చేయాలంటే? :
Airtel 5G Plus మీ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటోమాటిక్‌‌గా మీ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. మీరు 5G పొందలేకపోతే ఓసారి ఇలా చెక్ చేయండి.

* మీరు 5G స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా లేదా అని చెక్ చేయండి.
* మీ స్మార్ట్‌ఫోన్ 5G అయితే.. 5G సపోర్టు పొందడానికి మీ సిస్టమ్ OSని అప్‌డేట్ చేయండి.
* మెజారిటీ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ 5G రెండింటికీ సిస్టమ్ సపోర్టును రిలీజ్ చేసింది.
* హ్యాండ్‌సెట్ సెట్టింగ్‌లను మార్చండి.
* 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించండి. Setting> Mobile Network> tap on Airtel SIM> 5G network mode ఎంచుకోండి.
* system updateను డౌన్‌లోడ్ చేయాలి.
* సిస్టమ్ అప్‌డేట్‌ల కోసం చెక్ చేయడానికి, device Settings> About phone> Check for updates> Install చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Plans Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఫ్రీగా OTT సబ్‌స్ర్కిప్షన్, అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!