Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!

భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నారు.

Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!

Apple Iphone 12 Is Available At Lowest Price Via Online And Offline Markets (1)

Apple iPhone 12 : భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో కన్నా భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు అతి చౌకైన ధరకే అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్లలో సాధ్యమైనంత తక్కువ ధరకు మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 14 లాంచ్‌ సమయం ఆసన్నమైంది. ఐఫోన్ 13 ధర ఇప్పటికీ చాలా ఎక్కువనే చెప్పాలి. ఇంత ఖరీదు పెట్టి ఐఫోన్ కొనుగోలు చేయాలంటే అందరికి సాధ్యకాదు. అన్ని డబ్బులు పోసి కొనలేరు కూడా. ఏదైనా ఐఫోన్ బడ్జెట్ రూ. 50వేలు అయితే iPhone 12 కొనుగోలు చేయొచ్చు. లేటెస్ట్ iPhone డీల్ గురించి కొన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయి.

అందులో ఐఫోన్ 12 ఆన్‌లైన్ మార్కెట్ ద్వారా అతి తక్కువ ధరకు లభిస్తుంది. Apple అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ఇప్పటికీ iPhone 12 ఫోన్ అసలు ధరకే విక్రయిస్తోంది. ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చాలా తక్కువ ధరకు పొందవచ్చు. అమెజాన్ ఐఫోన్ 12ను 64GB స్టోరేజ్ మోడల్‌కు రూ.55,900 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఈ డివైజ్ 2021లో భారీగా తగ్గింది. ఆ తర్వాత అధికారికంగా రూ. 65,900కి అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మీరు రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ కార్డ్ ఆఫర్ లేదని గుర్తించాలి. కానీ, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

Apple Iphone 12 Is Available At Lowest Price Via Online And Offline Markets (2)

Apple Iphone 12 Is Available At Lowest Price Via Online And Offline Markets

అమెజాన్ లిస్టింగ్ ప్రకారం.. కొనుగోలుదారులు పాత ఫోన్‌కి బదులుగా రూ. 9,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ పరిస్థితి ఆధారంగా డిస్కౌంట్ మొత్తం లెక్కించవచ్చు. యూజర్లు కేవలం Amazon వెబ్‌సైట్‌కి వెళ్లి.. పాత ఫోన్‌కు బదులుగా ఎంత డిస్కౌంట్ పొందవచ్చనేది వంటి ఫీచర్ల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం Flipkart వెబ్‌సైట్లో iPhone 12 (64GB) కొంచెం ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. అలాగే ఎక్స్ఛేంజ్ ధర కూడా ఎక్కువగానే ఉంది. కానీ, హ్యాండ్‌సెట్ రూ. 65,900 నుంచి రూ. 59,999కి అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తోంది. రూ.12,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. మీరు డివైజ్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. తక్కువ ధరకు ఏది ఆఫర్ చేస్తుందో ఓసారి రెండింట్లో చెక్ చేసుకోవడం ఉత్తమం.

ఐఫోన్ 12 ఫోన్ డిస్కౌంట్ :
ఆఫ్‌లైన్ మార్కెట్ విషయానికొస్తే.. Apple అధీకృత రిటైలర్, ఇమాజిన్, Apple iPhone 12ను రూ. 55,900 ధరకు అందిస్తోంది ఆపిల్ కండీషన్స్ ప్రకారం.. అంతకంటే తక్కువ ధరకు పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. అలాగే దీనిపై రూ. 7,000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. పరికరం రిటైల్ ధర రూ. 65,900గా ఉంది. మీరు HDFC బ్యాంక్ కార్డ్‌ ద్వారా తీసుకుంటే ఐఫోన్ 12 మోడల్ రూ. 55,900 ధరతో పొందవచ్చు. మీకు ఎలాంటి కార్డ్ లేకపోతే ఎలాంటి షరతులు లేకుండా డివైజ్ రూ.58,900కి కొనుగోలు చేయవచ్చు. స్టోర్ ఎక్స్ఛేంజ్ ధర విషయానికి వస్తే.. వినియోగదారులు ఉపయోగించే డివైజ్ పర్ఫార్మెన్స్ బట్టి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. మీ డివైజ్ విలువ రూ. 15వేల కన్నా ఎక్కువ ఉంటే రూ. 4,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. అన్ని ఆఫర్‌లతో కలిసి ఐఫోన్ 12 రూ. 50,000 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆపిల్ ఐఫోన్ 12 మోడల్ కొనేసుకోండి. లేదంటే మళ్లీ ధర పెరిగే అవకాశం లేకపోలేదు.

Read Also : Apple iPhone 13 : ‘మేడ్ ఇన్ ఇండియా’.. ఆపిల్ ఐఫోన్ 13 తయారీ మొదలైందోచ్.. ఇకపై లేటెస్ట్ ఐఫోన్లన్నీ చెన్నైలోనే..!