ఇండియాలో భారీగా తగ్గనున్న ఐఫోన్ ధరలు

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ ధరలు తగ్గనున్నాయి. అందులోనూ భారత మార్కెట్లో అతి త్వరలో ఐఫోన్ ధరలు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపిల్ కంపెనీ భారత మార్కెట్లో ఐపోన్ 12 మ్యానిఫ్యాక్చరింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇండియాలో భారీగా తగ్గనున్న ఐఫోన్ ధరలు

Apple manufacture iPhone 12 locally in India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ ధరలు తగ్గనున్నాయి. అందులోనూ భారత మార్కెట్లో అతి త్వరలో ఐఫోన్ ధరలు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపిల్ కంపెనీ భారత మార్కెట్లో ఐపోన్ 12 మ్యానిఫ్యాక్చరింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. భారతదేశంలో ఐఫోన్ 12 మ్యానిఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని 7శాతం నుంచి 10 శాతం వరకు తరలించడమే లక్ష్యంగా అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం కసరత్తు చేస్తోంది.
Apple start manufacturing iPhone 12 locally in India Very soon ఇప్పటికే ఆపిల్ తమ బ్రాండ్ ఐఫోన్ కు సంబంధించి పలు మోడళ్లలో ఐఫోన్ SE, ఐఫోన్ XR, ఐఫోన్ 11 సహా ఇతర మోడళ్లపై మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తోంది. ఫ్యాక్స్ కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి భాగస్వామ్య కంపెనీలతో కలిసి ఆపిల్ ఈ మోడళ్లను తయారుచేస్తోంది. అందిన రిపోర్టు ప్రకారం.. ఐఫోన్ 12 మోడల్ కోసం కూడా ఇదే కంపెనీలు స్థానికంగా మ్యానిఫ్యాక్చరింగ్ చేయాలని భావిస్తున్నాయి. దాంతో ఐఫోన్ 12 ఫ్లాగ్ షిప్ ఫోన్ల ధరలు చౌకగా అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం రిటైల్ ఐఫోన్ల ధర మార్కెట్లో రూ.69,990గా ఉంది. భారత ప్రభుత్వ పీఎల్ఐ స్కీమ్ కింద క్యుపర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రొడక్షన్ మొదలుపెట్టనుంది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 12 మోడల్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో లభ్యం కానుంది. ఐఫోన్ల తయారీకి భారీ దిగుమతి పన్నులను తగ్గించుకోవడంలో తోడ్పతుందని కంపెనీ భావిస్తోంది. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 12 మోడల్ 2021 మధ్య ఏడాదిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 12 మినీ మోడల్ స్థానికంగా మ్యానిఫ్యాక్చర్ చేయనున్నట్టు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. దీనిపై ఆపిల్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.