Apple Watch Series 8 Price : ఆఫర్ అంటే ఇది భయ్యా.. భారీగా తగ్గిన ఆపిల్ వాచ్ సిరీస్ 8.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Apple Watch Series 8 Price : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ వాచ్ సిరీస్ 8 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకు ఆఫర్‌ అందిస్తోంది. ఆపిల్ సిరీస్ 8 వేరియంట్ రూ. 22వేల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Apple Watch Series 8 Price : ఆఫర్ అంటే ఇది భయ్యా.. భారీగా తగ్గిన ఆపిల్ వాచ్ సిరీస్ 8.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Apple Watch Series 8 now at Rs 19,999 on Flipkart, slashed by Rs 22,000

Apple Watch Series 8 Price : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం. ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న (Apple iPhone 15) అతి త్వరలోనే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 ధర అమాంతం తగ్గింది.

Read Also : Apple iPhone 12 Offer : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ. 6 వేలు మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు గతేడాది లాంచ్ అయిన ఆపిల్ వాచ్ సిరీస్ 8, ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం (Flipkart)లో అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 8 మోడల్‌ను రూ. 22వేలు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే.. ఆపిల్ వాచ్ ధర రూ.19,999కి కొనుగోలు చేయొచ్చు.

ఆపిల్ వాచ్ ఫీచర్లు, డిస్కౌంట్ :

ఆపిల్ వాచ్ రూ. 45,900 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 8 డివైజ్ రూ. 3,901 మార్క్‌డౌన్ తర్వాత రూ. 41,999కి లిస్టు అయింది. PNB క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు రూ. 2వేల వరకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. అదనంగా, ఈ ప్లాట్‌ఫారమ్ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 20వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. గణనీయమైన తగ్గింపు తర్వాత ఆపిల్ వాచ్ సిరీస్ 8ని రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు.

Apple Watch Series 8 now at Rs 19,999 on Flipkart, slashed by Rs 22,000

Apple Watch Series 8 Price now at Rs 19,999 on Flipkart, slashed by Rs 22,000

ఆపిల్ వాచ్ సిరీస్ 8 మోడల్ ఐకానిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే రెటీనా డిస్‌ప్లే, కింద పడిన పగలని ఫ్రంట్ క్రిస్టల్‌ను కలిగి ఉంటుంది. 18-గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ మోడల్ ECG యాప్, ఫాల్ డిటెక్షన్ వంటి హెల్త్, సెక్యూరిటీ ఫీచర్లతో వచ్చింది.

ఈ కొత్త ఫీచర్లలో ఉష్ణోగ్రత-సెన్సింగ్ సామర్థ్యాలు, రెట్రోస్పెక్టివ్ అండోత్సర్గ అంచనాలు, క్రాష్ డిటెక్షన్, అంతర్జాతీయ రోమింగ్ ఉన్నాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 9 డివైజ్, ఆపిల్ ఐఫోన్ 15 ఒకేసారి లాంచ్ కానున్నాయి. అంతకంటే ముందే భారీ తగ్గింపుతో ఆపిల్ వాచ్ సిరీస్ 8 టెక్ ఔత్సాహికులకు అందుబాటులోకి వచ్చింది.

Read Also : Apple iPhone 15 Series : వచ్చే సెప్టెంబర్‌లోనే ఆపిల్ ఐపోన్ 15 సిరీస్.. లాంచ్ డేట్, ప్రీ-ఆర్డర్ సేల్ ఎప్పుడంటే? పూర్తి వివరాలు మీకోసం..!