Bajaj : హైదరాబాద్‌‌లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు, ఎక్కడో తెలుసా

‘బజాజ్’ సంస్థ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తోంది. ఒక్కో నగరంలో అమ్మకాలు చేస్తూ వస్తున్న ఈ సంస్థ...తాజాగా..హైదరాబాద్ లో అమ్మకాలు ప్రారంభించింది.

Bajaj : హైదరాబాద్‌‌లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలు, ఎక్కడో తెలుసా

Bajaj

Bajaj Electric Scooter : ఎలక్ట్రిక్ వాహనాలపై పలు కంపెనీలు ఫోకస్ పెట్టాయి. పెరుగుతున్న చమురు ధరలు సామాన్యడికి చుక్కలు చూపెడుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అత్యాధునిక ఫీచర్లు, ఏ మాత్రం పెట్రోల్ వాహనాలకు తీసిపోని విధంగా..ఎలక్ట్రిక్ వాహనాలను పలు కంపెనీలు రూపొందిస్తున్నాయి. బుకింగ్స్ అదరగొడుతున్నాయి. ‘బజాజ్’ సంస్థ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్ లో విడుదల చేస్తోంది. ఒక్కో నగరంలో అమ్మకాలు చేస్తూ వస్తున్న ఈ సంస్థ…తాజాగా..హైదరాబాద్ లో అమ్మకాలు ప్రారంభించింది.

Read More : Bajaj Chetak : బజాజ్ చేతక్ ధర రూ.10 వేలు.. ఫియట్ కారు రూ.9 వేలు

 

Bajaj Scooter

తొలుత తమిళనాడు రాష్ట్రంలో వాహనాలను విక్రయించడం ప్రారంభించింది. అనంతరం కర్నాటక, మహారాష్ట్రలో కూడా సేల్స్ చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కూకట్ పల్లి, బేగంపేట, కాచిగూడలలో ఉన్న బజాజ్ చేతక్ షోరూంలలో స్కూటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ లో రిజిస్ట్రర్ చేసుకున్న వాళ్లు..షోరూమ్ లకు వెళ్లి డెలివరీ తీసుకోవాలి. హైదరాబాద్ లో ప్రీమియం వేరియంట్ ఒక్కటే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రీమియం, అర్బన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం నాలుగు రంగుల్లో లభిస్తుంది. అర్బన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

Read More : Bajaj Electric Scooter : త్వరలో హైదరాబాద్‌‌లో బజాజ్ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Bajaj Scooter Hyd

ఫుల్ ఛార్జ్ చేస్తే..ఎకానమీ మోడ్ లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఫుల్ ఛార్జింగ్ చేయడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. క్విక్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక ధర విషయానికి వస్తే…బజాజ్ చేతక్ ప్రీమియం హైదరాబాద్ ఎక్స్ షోరూం ధర రూ. 1,50,461 ఉండగా…ఆన్ రోడ్ ధర రూ. 1,89,175లుగా ఉంది. బజాజ్ అర్బన్ ఎక్స్ షోరూం ధర రూ. 1,00,000గా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన సంగతి తెలిసిందే.

Read More : Bajaj Chetak: మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్!

మూడేళ్లు లేదా 50 వేల కిలోమీటర్ల ప్రయాణం వరకు స్కూటర్, లిథియం ఐయాన్ బ్యాటరీపై బజాజ్ సంస్థ వారంటీ అందిస్తోంది. టైర్లపై వన్ ఇయర్ ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవాలంటే…ముందుగా ఆన్ లైన్ లో రూ. 200 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు చేతక్ డాట్ కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలు పొందుపరిచిన అనంతరం స్కూటర్ ను ఎంపిక చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ ని రద్దు చేసుకుంటే..రూ. 1000 రీఫండ్ వస్తుంది.