CIBIL Score : మీకు సిబిల్ స్కోరు లేదా? అయినా రుణం తీసుకోవచ్చా? ఎలానంటే?

మీ క్రెడిట్ స్కోరు ఎంత? సిబిల్ స్కోరు ఎంత ఉంది? క్రెడిట్ హిస్టరీ సరిగా లేకపోతే లోన్లు రావంటారు. ఏ బ్యాంకులు కూడా ముందుకు రావంటారు. కొంతవరకు ఇది నిజమే కావొచ్చు.

CIBIL Score : మీకు సిబిల్ స్కోరు లేదా? అయినా రుణం తీసుకోవచ్చా? ఎలానంటే?

Can You Avail A Loan Without Being In The Cibil System

CIBIL Score for Loans : మీ క్రెడిట్ స్కోరు ఎంత? సిబిల్ స్కోరు ఎంత ఉంది? క్రెడిట్ హిస్టరీ సరిగా లేకపోతే లోన్లు రావంటారు. ఏ బ్యాంకులు కూడా ముందుకు రావంటారు.  ఇది నిజమే కావొచ్చు. కానీ, సిబిల్ స్కోరు మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గత రెండేళ్ల కాలంలో చిన్న మొత్తంలో లోన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోవడంతో పాటు వేతనాల్లో కోతలు, వైద్య అత్యవసర పరిస్థితులు, కొత్త ఉద్యోగాల కోసం నైపుణ్యం పెంచే కోర్సులు కారణాలతో స్వల్ప కాలిక రుణాల కోసం చూసేవారు ఎక్కువగా పెరిగారు. 2020 నాలుగో త్రైమాసికంలో జారీ చేసిన రుణాల్లో 60 శాతం రూ.25వేల లోపుగా ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి. ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారట. యువత ఎక్కువగా రుణాలవైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. సాధారణంగా సిబిల్ స్కోరును చూసి బ్యాంకులు లోన్లు ఇస్తుంటాయి. క్రెడిట్ రిపోర్టులో మీ క్రెడిట్ హిస్టరీకి మీ పూర్తి సమాచారం పరిశీలిస్తారు. లోన్ తొందరగా దొరకాలంటే హెల్తీ క్రెడిట్ స్కోరును కలిగి ఉండాలంటారు. లోన్లు తీసుకునే వారి క్రెడిట్ స్కోరు ఎలా తెలుసుకోవాలి? ఎలా నిర్వహించాలి? క్రెడిట్ స్కోరు ఎంత ఉంటే మంచిది? క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..

సిబిల్ స్కోరు.. అంటే? :
సిబిల్ స్కోరు.. (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్)గా పిలుస్తారు. ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తుంది. ఎన్ని రుణాలు తీసుకున్నారు.. క్రెడిట్ కార్డుల చెల్లింపులు మొత్తం డేటాను సిబిల్ సేకరించి రిపోర్టు చేస్తుంది. ఇదే రిపోర్టును బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా యాక్సస్ చేసుకుని సదరు వ్యక్తికి రుణాలు ఇవ్వాలా? లేదా అని పరిశీలిస్తాయి. బ్యాంకులు రుణగ్రహీతల డేటాను సిబిల్ కు అందజేస్తాయి. ఈ డేటాను ఉపయోగించి సిబిల్ క్రెడిట్ స్కోరు రెడీ చేస్తుంది. మై సిబిల్ (My CIBIL) అధికారిక వెబ్‌సైట్ ద్వారా Onlineలో రిజిస్టర్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత అడ్రస్ ప్రూప్, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు వంటి డాక్యుమెంట్లను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత క్రెడిట్ స్కోరును ట్రాక్ చేయొచ్చు.
Read Also : Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!

క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే…
క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే… భవిష్యత్తులోన్లు సులభంగా పొందవచ్చు. సాధారణంగా సిబిల్ స్కోరు అనేది 300 నుంచి 900 మధ్య ఉండాలి. 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోరు ఉంటే.. వారిది హెల్తీ హిస్టరీగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ స్కోరు ఉంటే మాత్రం లోన్లు రావడం కష్టమేనని చెప్పవచ్చు. బ్యాంకులు ఈ స్కోరు ఆధారంగానే లోన్లు మంజూరు చేయాలా? వద్దా అని ఆలోచిస్తాయి. లోన్ ఇవ్వడంలో క్రెడిట్ స్కోరు కీ రోల్ ఉంటుందనేది గుర్తించుకోవాలి. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ముందుకు వస్తాయి. కార్డు లిమిట్ కూడా ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వీరికి తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది. క్రెడిట్ హిస్టరీ మంచిగా ఉంటే ఉద్యోగాలు, విదేశీ పర్యటనలకు వీసా కూడా తొందరగా పొందే అవకాశం ఉంటుంది.

సిబిల్ స్కోర్.. మీ క్రెడిట్ రిపోర్టులో వివాదాస్పద లావాదేవీలను వెంటనే క్లియర్ చేసుకోవాలి. EMI, లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో పేమెంట్ చేయాలి. క్రెడిట్ కార్డును ఎప్పుడూ కూడా గరిష్ఠ పరిమితికి మించి వాడకూడదని గుర్తించుకోవాలి. రుణం తీసుకొని షాపింగ్ చేయడానికి ప్రయత్నించవద్దు. క్రెడిట్ హిస్టరీని పెంచుకోవడమే లక్ష్యంగా లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం అప్లయ్ చేసుకోవద్దు. ఎక్కువగా లోన్లు తీసుకోవద్దు. సకాలంలో చెల్లిస్తున్నాం కదా అని క్రెడిట్ హిస్టరీ బాగుందిలే అవసరానికి మించి లోన్లు తీసుకోవడం చేయరాదు. అలా చేస్తే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త..

అసలు క్రెడిట్ స్కోరు లేకుండా సిబిల్ స్కోరు లేకుండా లోన్లు తీసుకోవడం సాధ్యేమేనా అంటే సాధ్యమే.. సెక్యూర్డ్ రుణాలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ మీరు లోన్లు తీసుకోవాలంటే ఏదైనా ఆస్తిని హామీగా ఉంచాలి. బంగారం పెట్టి ఎలా రుణం తీసుకుంటామో అలాగే ఏదైనా ఇల్లు లేదా ఆస్తులను హామీగా పెట్టి లోన్లు పొందవచ్చు. దీనికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. ఈ లోన్లతో క్రెడిట్ స్కోరుకు సంబంధం లేదన్నారు కదా అని.. సకాలంలో పేమెంట్ చేయకపోతే మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుందని గుర్తించుకోండి.
Read Also : Facebook Outage : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ మళ్లీ డౌన్.. ఏకిపారేసిన నెటిజన్లు!