Viral AI ChatGPT Ban : చాట్‌జీపీటీ బ్యాన్.. దేశాలన్నీ ఈ టూల్‌ను ఎందుకు బ్యాన్ చేస్తున్నాయో తెలుసా? ఫుల్ లిస్టు మీకోసం..!

Viral AI ChatGPT Ban : ప్రపంచమంతా చాట్‌జీపీటీ పేరు వింటేనే వణికిపోతోంది. చాట్‌జీపీటీ (ChatGPT) అనేది ఏఐ టూల్.. ఈ (OpenAI) టూల్ వినియోగంతో ప్రపంచానికి అసలు ముప్పు ఉందా? ఇప్పటివరకూ ఏయే దేశాలు చాట్‌బాట్‌‌ను బ్యాన్ చేశాయో ఓసారి లుక్కేయండి.

Viral AI ChatGPT Ban : చాట్‌జీపీటీ బ్యాన్.. దేశాలన్నీ ఈ టూల్‌ను ఎందుకు బ్యాన్ చేస్తున్నాయో తెలుసా? ఫుల్ లిస్టు మీకోసం..!

ChatGPT Ban In Many Countries (Photo : Google)

Viral AI ChatGPT Ban : చాట్‌జీపీటీ.. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. క్షణం కూడా ఆలోచించకుండా తమ దేశాల్లో ఈ ఓపెన్‌ఏఐ (OpenAI)ని బ్యాన్ చేసేస్తున్నాయి. నిజానికి.. ఇదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (Artificial intelligence) AI టూల్.. చాట్‌జీపీటీని చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ (Chat Generative Pre Trained Transformer) అని కూడా అంటారు. ఈ టూల్ అడ్వాన్స్‌డ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. మీరు ఈ చాట్ (GPT)ని ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం ఇచ్చేస్తుంది. అన్ని ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలోనూ సమాధానం ఇస్తుంది. ఏ ప్రశ్న అడిగినా AI టూల్ సమాధానాన్ని చాలా వేగంగా వివరంగా ఇస్తుంది. ఈ టూల్ ద్వారా ప్రైవసీకి ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.

అందుకే, చాలా వరకూ దేశాలు ఈ చాట్‌జీపీటీని నిషేధిస్తున్నాయి. ఇటలీలోని డేటా ప్రొటెక్షన్ అథారిటీ ప్రైవసీ సమస్యలకు సంబంధించి ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో (OpenAI) Viral AI చాట్‌బాట్‌ (ChatGPT)ని నిషేధించింది. ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ వాచ్‌డాగ్ (Garante) ఇతరుల చాట్‌బాట్ సంభాషణ క్యాప్షన్లను చూసేందుకు యూజర్లకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో యూజర్ల డేటా ఉల్లంఘనపై విచారణ సమయంలో ఇటాలియన్ యూజర్ల డేటాను ప్రాసెస్ చేయడాన్ని ఆపమని OpenAIని ఆదేశించింది. దీనికి సంబంధించి నెలకొన్న ఆందోళనలపై 20 రోజుల్లో పరిష్కరించాలని లేదా 21.7 మిలియన్ డాలర్లు లేదా వార్షిక రాబడిలో 4 శాతం వరకు జరిమానా విధించాలని OpenAIని ఇటలీ హెచ్చరించింది.

ఇతర వినియోగదారుల చాట్‌బాట్ సంభాషణ క్యాప్షన్లను చూడటానికి యూజర్లను అనుమతించే (OpenAI)లో డేటా ఉల్లంఘనను రెగ్యులేటర్ తప్పుబట్టింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారపడే అల్గారిథమ్‌లకు ‘Training’ ఇవ్వడానికి వ్యక్తిగత డేటా భారీ సేకరణ, ప్రాసెసింగ్‌కు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వాచ్‌డాగ్ (Garante) తెలిపింది. ChatGPTకి వయస్సు పరిమితులు లేకపోవడంతో పాటు ప్రతిస్పందనలలో సరికాని సమాచారాన్ని అందించే సామర్థ్యంపై కూడా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

Read Also : ChatGPT Whatsapp : వాట్సాప్‌లో మెసేజ్‌ చేయడం మీకు నచ్చదా? ఈ ChatGPT టూల్.. మీ వాట్సాప్ మెసేజ్‌లకు అదే ఆన్సర్ ఇస్తుంది తెలుసా?

అయితే, AI- జనరేటివ్ చాట్‌బాట్- ChatGPT వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాల్లో ఇటలీ మాత్రమే కాదు. ఇంతకుముందు, ఇటలీ, ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా మరియు చైనా కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు.. సరిహద్దుల్లో ఓపెన్ AI ఉత్పాదక AI టూల్ అందుబాటులో లేకుండా చేశాయి. (ChatGPT) సంబంధించిన ఆందోళనలను లేవనెత్తిన తర్వాత OpenAI చాట్‌బాట్ వినియోగాన్ని ఏయే దేశాలు నిషేధించాయి.. ఎలాంటి పరిమితులు విధించాయి అనేది పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం.

చైనా :
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా ప్రపంచ కథనాలను ప్రభావితం చేసే చాట్‌జిపిటి వంటి AI ప్లాట్‌ఫారమ్‌లను అమెరికా ప్రయోగిస్తుందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశీ వెబ్‌సైట్‌లు, అప్లికేషన్‌లకు వ్యతిరేకంగా కఠినమైన నియమాలు, చైనా, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలలో సరిగా లేవు. ఈ క్రమంలో చైనా ChatGPTని నిషేధించింది. ChatGPT వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లను తమ దేశ సరిహద్దుల్లో పనిచేయడానికి అనుమతించడం లేదు.

ChatGPT Ban _ Viral AI chatbot ChatGPT is banned in many countries, but why_ Full list of countries

ChatGPT Ban In Many Countries (Photo : Google)

రష్యా :
ChatGPT వంటి AI ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగం విషయంలో మాస్కో కూడా ఆందోళన చెందుతోంది. అదనంగా, పాశ్చాత్య దేశాలతో ప్రస్తుత పరోక్ష వైరుధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. రష్యా కూడా దేశంలోని కథనాలను ప్రభావితం చేసేందుకు (ChatGPT) వంటి ప్లాట్‌ఫారమ్‌ను అనుమతించడం లేదు. అందుకే ఈ టూల్‌ను రష్యా బ్యాన్ చేసింది.

ఇరాన్ :
ఇరాన్ కఠినమైన సెన్సార్‌షిప్ నిబంధనలకు పెట్టింది పేరు.. అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను కచ్చితంగా పర్యవేక్షిస్తుంది. అలాగే.. ఆన్‌లైన్ డేటాను ఫిల్టర్ చేస్తుంది. అనేక వెబ్‌సైట్‌లు, సర్వీసులకు యాక్సస్ పరిమితం చేస్తుంది. అదనంగా, ట్రంప్ పాలనలో అణు ఒప్పందం నుంచి వైదొలిగినప్పటి నుంచి ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. అన్ని రాజకీయ ఒత్తిడులను అనుసరించి అమెరికా AI చాట్‌బాట్ వినియోగంపై ఇరాన్‌ కూడా నిషేధం విధించింది.

ఉత్తర కొరియా :
ఉత్తర కొరియాలో, కిమ్ జోంగ్-ఉన్ ప్రభుత్వం ఇంటర్నెట్ వినియోగాన్ని భారీగా పరిమితం చేసింది. అక్కడి పౌరుల ఆన్‌లైన్ కార్యకలాపాలను కూడా నిశితంగా పర్యవేక్షిస్తుంది. ఈ స్థాయి అధికార నియంత్రణ కారణంగా ఉత్తర కొరియా ప్రభుత్వం ChatGPT వినియోగాన్ని నిషేధించడంలో ఆశ్చర్యం లేదు.

క్యూబా :
క్యూబాలో కూడా.. ఇంటర్నెట్ సదుపాయం పరిమితం చేసింది. ప్రభుత్వంచే అక్కడి కచ్చితంగా కంట్రోల్ చేస్తోంది. అనేక వెబ్‌సైట్‌లు బ్లాక్ అయ్యాయి. OpenAI కృత్రిమ మేధస్సుతో కూడిన చాట్‌బాట్ ChatGPTతో సహా అక్కడి ప్రజలకు అందుబాటులో లేదు.

సిరియా :
కఠినమైన ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ చట్టాలు కలిగిన మధ్యప్రాచ్యంలోని సిరియాలో కూడా ప్రభుత్వం ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షిస్తుంది. అంతే డేటాను కూడా ఫిల్టర్ చేస్తుంది. వివిధ వెబ్‌సైట్‌లు, సర్వీసులను యాక్సెస్ చేయకుండా అక్కడి యూజర్లను నిరోధిస్తుంది. అదే కారణంగా, అమెరికా ఆధారిత కంపెనీ అభివృద్ధి చేసిన AI ప్లాట్‌ఫారమ్ ChatGPT కూడా అందుబాటులో లేదు. ఇప్పటికే తప్పుడు సమాచారంతో ఆ దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాట్ జీపీటీ వినియోగంపై కూడా నిషేధం విధించింది.

Read Also : ChatGPT Tech Tips : ఒకే రోజులో రూ. 10వేలు సంపాదించడం ఎలా? అని అడిగితే.. ChatGPT ఎలాంటి టిప్స్ ఇచ్చిందో తెలిస్తే షాకవుతారు!