Vivo iQOO : భారత మార్కెట్లోకి ఐక్యూ స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?
చైనా స్మార్ ఫోన్ కంపెనీ వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ తన జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Vivo iQOO : చైనా స్మార్ ఫోన్ కంపెనీ వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ తన జెడ్5 స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తోపాటు 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉన్న ఈ ఫోన్ లో 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని అమర్చారు.
Read More : Amazon.. ఇదో ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఏకిపారేసిన ఆర్ఎస్ఎస్ ‘పాంచజన్య’ మ్యాగజైన్
64mp బ్యాక్ కెమెరా, ట్రిపుల్ రియల్ స్టేటస్ కలిగి ఉంది. ధర విషయానికి వస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఐక్యూ జడ్5 రూ.23,990కి లభిస్తే, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.26,990 ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్ కింద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్/క్రెడిట్, ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.
Read More : Qureshi : లండన్‌లో పాక్ మంత్రికి చుక్కెదురు
ఇక ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే
6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD డిస్ ప్లే
64 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా
16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్‌లెస్ సపోర్ట్
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.23,990
12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.26,990