మీపై నిఘా పెట్టేందుకు కంపెనీలు ఈ ఇమెయిల్ ట్రిక్‌ వాడుతున్నాయంట.. మీరు కూడా కనిపెట్టలేరు!

మీపై నిఘా పెట్టేందుకు కంపెనీలు ఈ ఇమెయిల్ ట్రిక్‌ వాడుతున్నాయంట.. మీరు కూడా కనిపెట్టలేరు!

Companies use this pixel trackers : డిజిటల్ ప్రపంచమంతా నిఘా నీడలోనే నడుస్తోంది. మనకు తెలియకుండానే మన డిజిటల్ డేటా ట్రాక్ చేస్తున్నారనే విషయమే గ్రహించలేకపోతున్నాం.. ఇమెయిల్ అకౌంట్లకు పంపిన మెసేజ్‌ల ట్రాక్ చేస్తున్నారనే గ్రహించేలేరు.

స్పై పిక్సెల్స్ అని పిలిచే కొన్ని ట్రాకర్ల ద్వారా ఇమెయిల్ అకౌంట్లలో మన డేటాను సీక్రెట్‌గా ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఈమెయిల్ లాగిన్ అయ్యారు? ఏమి ఓపెన్ చేశారు? ఏ డివైజ్ లో చూశారు? ఏ లొకేషన్ లో ఉన్నారు ఇలా ప్రతిదీ ట్రాక్ చేయడం జరుగుతుంది.

Companies use this email trick to spy on you all the time

చాలావరకూ కంపెనీలు ఈ మెయిల్ ట్రిక్ ద్వారానే మీపై నిఘా పెట్టేందుకు వాడుతున్నాయి.. మిమ్మల్ని కంపెనీలు ట్రాక్ చేస్తున్న విషయం కూడా గ్రహించలేరు. మూడింట రెండింతలు ఇమెయిల్స్‌కు స్పై ఫిక్సల్స్ మెసేజ్‌లు వస్తున్నాయని ఓ రివ్యూ డేటా వెల్లడించింది. ఆ మెసేజ్ లు కూడా ఇమేజ్ ఫైళ్ల రూపంలో లేదా జిఫ్ ఫైల్ మాదిరిగా ఉంటాయి. ఇవి కళ్లకు కనిపించవు. ఈమెయిల్ బాడీలో ఎక్కడో ఒకచోట సీక్రెట్ గా పెడతారు.

దీని ద్వారా యూజర్లు ఏ ఇమెయిల్ ఓపెన్ చేశారు? ఎప్పుడు ఓపెన్ చేశారు? ఎన్నిసార్లు ఓపెన్ చేశారు? ఏ డివైజ్ నుంచి ఓపెన్ చేశారు? ఆ వ్యక్తి ఏ లొకేషన్ లో ఉన్నాడో కూడా ఐపీ అడ్రస్ ఆధారంగా ట్రాక్ చేస్తుంటారని డేటాలో వెల్లడైంది.