Facebook Pop-Up Feature : ఫేస్‌బుక్‌లో కొత్త పాప్‌అప్ ఫీచర్.. ఆర్టికల్ ఓపెన్ చేయకుండానే షేర్ చేయొచ్చు..

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. త్వరలో ఆర్టికల్ పాప్ అప్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ పాప్ అప్ ఫీచర్ ద్వారా యూజర్లు ఫేస్ బుక్ లో ఆర్టికల్ ఓపెన్ చేయకుండానే షేర్ చేసుకోవచ్చు.

Facebook Pop-Up Feature : ఫేస్‌బుక్‌లో కొత్త పాప్‌అప్ ఫీచర్.. ఆర్టికల్ ఓపెన్ చేయకుండానే షేర్ చేయొచ్చు..

Facebook Wants To Make Sure You’ve Read The Article You’re About To Share

Facebook Pop-Up Feature : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ప్రవేశపెడుతోంది. త్వరలో ఆర్టికల్ పాప్ అప్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ పాప్ అప్ ఫీచర్ ద్వారా యూజర్లు ఫేస్ బుక్ లో ఆర్టికల్ ఓపెన్ చేయకుండానే షేర్ చేసుకోవచ్చు. అంటే.. ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఆర్టికల్ ఓపెన్ చేయకుండా ఉంటే.. పోస్టుపై స్ర్కోల్ చేయగానే అక్కడ పాప్ అప్ మాదిరిగా డిస్ ప్లే అవుతుంది. వెంటనే యూజర్ ఆ ఆర్టికల్ ఓపెన్ చేసి చదువుకోవచ్చు లేదా అక్కడే ఇతరులకు షేర్ చేసుకోవచ్చు కూడా.

ప్రస్తుతానికి ఈ పాప్ అప్ ప్రాంప్ట్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా 6శాతం మంది ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుందని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ వివరాలను ఫేస్ బుక్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. 2020 జూన్ నెల నుంచే ట్విట్టర్ మాదిరిగా పాప్ అప్ ఫీచర్ ను ఫేస్ బుక్ టెస్టింగ్ చేయడం ప్రారంభించింది.


యూజర్లు తమ ఫీడ్ పై కనిపించే ఈ పాప్ అప్ ద్వారా ఆర్టికల్ చదివాలా? లేదా ఇతరులకు షేర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ పాప్ అప్ ఫీచర్ ద్వారా యూజర్లను ఆర్టికల్ చదివించడమే కాకుండా ఇతరులకు షేర్ చేసేందుకు ప్రోత్సహించేందుకు తీసుకువస్తున్నట్టు ఫేస్ బుక్ పేర్కొంది. అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించే ప్రయత్నమని తెలిపింది. ఒకవేళ ఆర్టికల్ ఓపెన్ చేయకుండానే షేరింగ్ చేస్తే.. అది మిస్సింగ్ కీ ఫ్యాక్ట్స్‌గా పరిగణించడం జరుగుతుందని అర్థమని సోషల్ దిగ్గజం పేర్కొంది.