Forgot SBI YONO Password : SBI YONO పాస్‌వర్డ్, యూజర్‌నేమ్ మరిచిపోయారా? ఎలా రీసెట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Forgot SBI YONO Password : ఆన్‌లైన్ షాపింగ్, మెడికల్ బిల్లులు చెల్లించడం వంటి మరిన్ని సర్వీసులను YONO యాప్ & వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఈ యాప్, వెబ్‌సైట్ Android, iOS వినియోగదారులకు రెండింటికీ అందుబాటులో ఉంది.

Forgot SBI YONO Password : SBI YONO పాస్‌వర్డ్, యూజర్‌నేమ్ మరిచిపోయారా? ఎలా రీసెట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Forgot SBI YONO password and username_ here is how to reset

Forgot SBI YONO Password : ప్రముఖ దేశీయ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అందించే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ (SBI YONO) యాప్ యూజర్లకు అలర్ట్.. మీరు SBI అకౌంట్‌దారులు అయితే.. మీ నెట్ బ్యాంకింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఓపెన్ చేయడం, లావాదేవీల హిస్టరీని చూడటం, విమానాలు, రైళ్లు, బస్సులు, టాక్సీలను బుకింగ్ చేయడం, ఆన్‌లైన్ షాపింగ్, మెడికల్ బిల్లులు చెల్లించడం వంటి మరిన్ని సర్వీసులను YONO యాప్ & వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఈ యాప్, వెబ్‌సైట్ Android, iOS వినియోగదారులకు రెండింటికీ అందుబాటులో ఉంది.

YONO స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు అన్ని బ్యాంకింగ్ సంబంధిత సర్వీసులను అందిస్తుంది. YONO వినియోగదారులు మీ ఆన్‌లైన్ SBI లాగిన్ ఆధారాలతో లేదా ATM కార్డ్‌తో సహా అకౌంట్ వివరాలతో Yono యాప్/పోర్టల్‌కి లాగిన్ చేయవచ్చు. మొబైల్‌లో YONO యాప్‌ని ఉపయోగించేందుకు భవిష్యత్తులో వేగవంతమైన లాగిన్ ప్రక్రియ కోసం 6-అంకెల MPINని కూడా సెట్ చేయవచ్చు.

పాస్‌వర్డ్, MPIN రెండూ YONO యాప్ ప్రైవసీతో పాటు సెక్యూరిటీని అందిస్తాయి. అయినప్పటికీ, తరచుగా చాలా మంది వినియోగదారులు, ముఖ్యంగా సీనియర్లు, లాగిన్ చేసేందుకు తమ Username లేదా Password మరచిపోతారు. SBI YONO యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ లేదా MPIN రీసెట్ చేయవచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా ఈ కింది విధంగా ఫాలో అయితే చాలు..

SBI YONO Username ఎలా రీసెట్ చేయాలంటే? :

* SBI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసేందుకు onlinesbi.comని విజిట్ చేయండి.
* పర్సనల్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసి Login ఎంచుకోండి.
* ఆ తర్వాత, అకౌంట్ వివరాల విభాగంలో ‘Forgot username/login password’ పై Click చేయండి.
* డ్రాప్-డౌన్ మెను నుంచి ‘forgot my username’పై Click చేయండి.
* పాప్ విండోలో Next బటన్‌పై Click చేయండి.
* ఇప్పుడు, CIF నంబర్, Country, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, Captcha కోడ్‌తో సహా అవసరమైన ఫీల్డ్‌లను నింపండి.
* ‘సమర్పించు’ బటన్‌పై Tap చేయండి.
* ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి, Confirmపై Click చేయండి.
* SBI పోర్టల్ మీకు మీ కొత్త YONO SBI లాగిన్ Username స్క్రీన్‌పై అందిస్తుంది.
* మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు Text message కూడా పొందుతారు.

Read Also :  SBI Card Charges : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. ఇక నుంచి రూ.99 సర్వీస్ ఛార్జ్

SBI YONO పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం ఎలా? :

* onlinesbi.comని విజిట్ చేయండి.
* అకౌంట్ వివరాల విభాగంలో Forgot login password చేయండి.
* ఇప్పుడు డ్రాప్-డౌన్ మెను నుంచి “Forgot my Login Passwordపై Click” ఎంచుకోండి
* ఇప్పుడు పాప్ విండోలో “Next” పై క్లిక్ చేయండి.
* మీ యూజర్ నేమ్, అకౌంట్ నంబర్, country, రిజిసర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, Captcha కోడ్‌తో సహా అవసరమైన ఫీల్డ్‌లను నింపండి.
* వివరాలను Submit చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో మీరు అందుకున్న OTPని నమోదు చేయడం ద్వారా Verify చేయండి.
* మీ పాస్‌వర్డ్‌ని రీసెట్ చేసి, ‘Submit’ బటన్‌ను Tap చేయండి.

Forgot SBI YONO password and username_ here is how to reset

Forgot SBI YONO password and username_ here is how to reset

SBI Yono MPINని ఎలా రీసెట్ చేయాలంటే? :

మీరు మీ MPINని మరిచిపోయారా? మీరు ముందుగా మీ MPINని Remove చేసి ఆపై దాన్ని Reset చేయాలి.

SBI YONO MPINని Remove చేయాలంటే? :

* SBI Yono యాప్‌ని ఓపెన్ చేయాలి.
* మీ Username, Password ఉపయోగించి Login చేయండి.
* ఇప్పుడు “Quick Links”కి వెళ్లి, “Service Request” ఆప్షన్‌పై Tap చేయండి.
* ఆ తర్వాత “Emergency” సెక్షన్ కింద ‘Manage PIN’ని ఎంచుకోండి.
* ఇప్పుడు ‘Remove MPIN’పై Tap చేయండి.
* ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు మీ yono sbi ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను రిజిస్టర్ చేయండి.
* పాప్ అప్ మెసేజ్‌పై Yesపై Click చేయండి.
* మీరు కచ్చితంగా మీ MPINని Remove చేయాలనుకుంటున్నారా?
‘Yes’పై Click చేయండి.
* మీ SBI MPIN విజయవంతంగా డిలీట్ అయింది.

YONO MPINని రీసెట్ చేయాలంటే? :

* SBI YONO యాప్‌ను ఓపెన్ చేసి.. లాగిన్ ఎంపికపై Click చేయండి.
* ఇప్పుడు MPIN సెక్షన్ ఉపయోగించి లాగిన్ కింద ఉన్న ‘SET MPIN’పై Tap చేయండి.
* ఆ తర్వాత మీ YONO SBI యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను రిజిస్టర్ చేయండి.
* ఇప్పుడు మీ కొత్త SBI MPINని సెట్ చేసి, Ad చేయండి.
* Confirm చేసి.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో మీరు అందుకున్న OTPని రిజిస్టర్ చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : SBI Card Charges : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. ఇక నుంచి రూ.99 సర్వీస్ ఛార్జ్