కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8మంది నేతలెవరు? వారిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా?- ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ

రాష్ట్ర సాధనలో రాజకీయంగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎదిగిన కేసీఆర్ కీర్తి ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? కారకులు ఎవరు?

కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8మంది నేతలెవరు? వారిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా?- ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ

Target KCR : తెలంగాణ రాజకీయ చిత్రంలో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని లోక్ సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ వచ్చిన బీఆర్ఎస్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత తిరుగులని రాజకీయ శక్తిగా ఎదిగింది.

అయితే, ఇప్పుడు అదంతా గతంగా మారిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? స్వయంకృతాపరాధమా? రాజకీయ ప్రత్యర్థుల చాణక్యమా? తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయంగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎదిగిన కేసీఆర్ కీర్తి ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? కారకులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఓ 8మంది ముఖ్య నేతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

భారతంలో పద్మవ్యూహంలా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8 మంది రాజకీయ నేతలు ఎవరు? ఆ 8మందికి కేసీఆర్ పై కోపమెందుకు? అప్పట్లో ఆ 8 మందిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా? అదే ఇప్పుడు బీఆర్ఎస్ కు శాపంగా మారిందా? ఈ అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ విశ్లేషణ..

Also Read : కేసీఆర్‌ని దేవుడు కూడా కాపాడలేడు.. ఇప్పటికే జైల్లో కవిత: మంత్రి కోమటిరెడ్డి