OnePlus Nord CE 4 Lite : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 4 Lite Launch : వన్‌ప్లస్ ఇంకా నార్డ్ సీఈ 4 లైట్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన ఒప్పో కె12ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి.

OnePlus Nord CE 4 Lite : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

OnePlus Nord CE 4 Lite teased to launch ( Image Credit : Google )

OnePlus Nord CE 4 Lite : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లాంచ్ తేదీని కంపెనీ రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 భారత్‌లో కొన్ని నెలల క్రితమే అరంగేట్రం చేసినప్పటికీ.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ లైనప్ నుంచి స్పష్టంగా లేదు. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ జూన్ 18న సాయంత్రం 7 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కావచ్చునని టీజర్ సూచిస్తోంది.

Read Also : Google Pixel 7a Discount : గూగుల్ పిక్సెల్ 7ఎపై భారీ తగ్గింపు.. రూ. 35వేల లోపు ధరకే సొంతం చేసుకోండి!

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ స్పెసిఫికేషన్‌లు : 
వన్‌ప్లస్ ఇంకా నార్డ్ సీఈ 4 లైట్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన ఒప్పో కె12ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి. అది నిజమని తేలితే.. నార్డ్ సీఈ 4 లైట్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1200నిట్స్ గరిష్ట ప్రకాశంతో వస్తుంది.

వన్‌ప్లస్ సీఈ 4 లైట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను అడ్రినో 619 జీపీయూతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో రావచ్చు.

ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. వన్‌ప్లస్ సీఈ 4 లైట్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ సెటప్‌తో రావచ్చు. అంతేకాకుండా, సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్‌ కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14లో రన్ అవుతుంది.

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ధర :
ఒప్పో కె12ఎక్స్.. చైనాలో 179 డాలర్లు (సుమారు రూ. 15వేలు) ధరతో ప్రారంభమైంది. టాప్-ఆఫ్-ది-రేంజ్ మోడల్ ధర 248 డాలర్లు (సుమారు రూ. 21వేలు)కి చేరుకుంది. వన్‌ప్లస్సీఈ 4 లైట్ ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది. అయితే, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అధికారిక ధరలు కాదని గమనించండి.

Read Also : ITR Filing Online : ఐటీఆర్ ఫైలింగ్.. ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలి? ఇదిగో సింపుల్ ప్రాసెస్!