Best Gadgets in 2021: 2021లో వచ్చిన ఈ గ్యాడ్జెట్స్ 2022లోనూ సూపర్ హిట్టే

రోజుల వ్యవధిలో మారిపోతున్న ఉపకరణాల్లో స్మార్ట్ ఫోన్స్ ముందున్నాయి. రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుండడంతో ప్రజలు కూడా వాటిని కొనేందుకు ఉత్సాహం కనబర్చుతున్నారు

Best Gadgets in 2021: 2021లో వచ్చిన ఈ గ్యాడ్జెట్స్ 2022లోనూ సూపర్ హిట్టే

Gadgets

Best Gadgets in 2021: పూటకో విధంగా మారిపోతున్న టెక్నాలజీ కారణంగా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. చూసిన వెంటనే కొనాలనిపించేలా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్స్, టీవీలు, లాప్ టాప్ లు ఇతర గ్యాడ్జెట్లు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వాటిన్నిటిని కొనాలంటే మన జేబుకు చిల్లు పడుతుంది. అందుకే దీర్ఘకాలం మన్నే విధంగా మనకు కావాల్సిన ఉపకరణాలను ఆచితూచి కొనుగోలు చేయాలి. స్మార్ట్ ఫోన్స్ లో అటువంటి మన్నిక గల ఉపకరణాలు ఏమున్నాయో చూడండి.

స్మార్ట్ ఫోన్స్ : రోజుల వ్యవధిలో మారిపోతున్న ఉపకరణాల్లో స్మార్ట్ ఫోన్స్ ముందున్నాయి. రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుండడంతో ప్రజలు కూడా వాటిని కొనేందుకు ఉత్సాహం కనబర్చుతున్నారు. ఇక దీర్ఘకాలం వాడుకునే స్మార్ట్ ఫోన్స్ లో యాపిల్ ఐఫోన్స్ 13 ఉన్నాయి. మంచి బిల్ట్ క్వాలిటీ, వేగంగా వచ్చే సాఫ్ట్ వేర్ అప్డేట్స్ తో.. ఐఫోన్స్ ను గరిష్టంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. 2021లో వచ్చిన యాపిల్ ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ఫోన్స్ 2022లోనూ వాడుకోవచ్చు. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లలో శాంసంగ్, రెడ్‌మి, వన్ ప్లస్ ఫోన్ లు ఉన్నాయి. వ్వేటిలో 2021లో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ Z Fold 3, Flip 3, A52 ఫోన్ లు 2022లోను వాడుకోవచ్చు. రెడ్‌మి నోట్ 10 Pro Max, వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్ లు కూడా మరి కొన్ని రోజుల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందుకుంటాయి.

Also Read: Anantapur News: అనంతపురం జిల్లాలో జింకల వేట కలకలం: నలుగురు వేటగాళ్లు అరెస్ట్

ఇవేకాక, 2021లో వచ్చిన ఐమ్యాక్ M1, యాపిల్ MacBook Pro(16-inch), డెల్ XPS 13, హెచ్‌పి పెవిలియన్ Aero 13 వంటి హై ఎండ్ ల్యాప్‌టాప్ లు సైతం 2022 చివరి వరకు ఉపయోగించుకోవచ్చు. ఫిట్నెస్ బ్యాండ్ లు కూడా ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. 2021లో వచ్చిన Mi Band 6, శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4, ఫిట్‌బిట్ సెన్స్ వంటి టాప్ బ్యాండ్స్ కు ఇప్పుడప్పుడే ఫాలోఅప్ సిరీస్ ఉండకపోవచ్చు. దీంతో 2022లో కూడా ఈ గ్యాడ్జెట్స్ ను ఉపయోగించుకోవచ్చు.

Also read: Twitter Trending: “అత్రంగి రే” చిత్రాన్ని బహిష్కరించండి