Google SMS Message : ఐఫోన్లలో SMS రియాక్షన్లపై గూగుల్ టెస్టింగ్.. ఐఫోన్ మెసేజ్‌లకు ఆండ్రాయిడ్ యూజర్లు ఎమోజీలు పంపొచ్చు!

Google SMS Message : ఆల్ఫాబెట్ గూగుల్ గత నెలలో #GetTheMessage అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఐఫోన్‌లలో RCS మెసేజింగ్‌కు ఇచ్చేలా Apple భాగస్వామ్యంతో ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది.

Google SMS Message : ఐఫోన్లలో SMS రియాక్షన్లపై గూగుల్ టెస్టింగ్.. ఐఫోన్ మెసేజ్‌లకు ఆండ్రాయిడ్ యూజర్లు ఎమోజీలు పంపొచ్చు!

Google tests SMS message reactions from iPhones Report

Google SMS Message : ఆల్ఫాబెట్ గూగుల్ గత నెలలో #GetTheMessage అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఐఫోన్‌లలో RCS మెసేజింగ్‌కు ఇచ్చేలా Apple భాగస్వామ్యంతో ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది. GSM Arena నివేదిక ప్రకారం.. Android, iPhone వినియోగదారుల మధ్య మెసేజ్‌లను మెరుగుపరిచేందుకు Google ప్రయత్నాల్లో భాగంగా లేటెస్ట్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. Reddit వినియోగదారు ప్రకారం.. Google Messages యాప్ iPhoneల నుండి పంపిన మెసేజ్‌లకు ప్రతిస్పందించే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

Android యూజర్లు iPhone యూజర్ నుంచి వచ్చిన SMSకి రియాక్షన్ ద్వారా ఎమోజీని పంపవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆపిల్ మాదిరిగానే గూగుల్ కూడా ఇదే విధమైన రియాక్షన్ తీసుకొచ్చింది. iOS వినియోగదారులు SMS మెసేజ్‌లకు రియాక్షన్ పంపుకోవచ్చు.

Google tests SMS message reactions from iPhones Reports

Google tests SMS message reactions from iPhones Reports

మెసేజ్ పొందిన యూజర్‌కు SMS మెసేజ్ తిరిగి పంపుకోవచ్చు. ఈ సందర్భంలో Android ఫోన్ నుంచి కోట్ చేసిన మెసేజ్ టెక్స్ట్‌తో పాటు రియాక్షన్ ఎమోజీ మెసేజ్ కూడా పంపుతుంది. అప్పుడు Messages యాప్ ఏ మెసేజ్ కోసం రియాక్షన్ వచ్చిందో తెలియజేసేలా గూగుల్ దీన్ని రూపొందించింది. వచ్చిన SMS పక్కనే ఎమోజీని చూపుతుంది.

Google ఐఫోన్ వినియోగదారులకు మెసేజ్ రియాక్షన్ టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూపిస్తుందని GSM Arena నివేదించింది. ఎమోజీతో మెసేజ్‌లకు రియాక్షన్ పంపడం కొత్తేమీ కాదు. ఇప్పటికే వాట్సాప్ (Whatsapp), టెలిగ్రామ్ (Telgram), మెసెంజర్ (Messenger), స్కైప్ (Skype), (Groups) బృందాలు, ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)తో సహా అనేక క్రాస్-ప్లాట్‌ఫారమ్ మెసేజింగ్ యాప్‌లు, అన్నీ ఎమోజీలతో రియాక్షన్లను పంపేందుకు సపోర్టు ఇస్తాయి.

WATCH : 110TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Maps Immersive View : గూగుల్ మ్యాప్స్‌లో అద్భుతమైన ఫీచర్.. మీరు సెర్చ్ చేసే లొకేషన్ 3D ఏరియల్ లైవ్ వ్యూలో చూడొచ్చు..!