Google Android 13 Go : బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్.. మరెన్నో స్పెషిఫికేషన్లతో..

Google Android 13 Go : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ను ఆవిష్కరించింది.

Google Android 13 Go : బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్.. మరెన్నో స్పెషిఫికేషన్లతో..

Google unveils Android 13 Go for budget smartphones with modest specifications

Google Android 13 Go : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ను ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు తగిన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ సరసమైన డివైజ్‌లను రూపొందించడంలో గో ఎడిషన్ 5 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టబడింది. ఆండ్రాయిడ్ ఈ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ నుంచి అనవసరమైన యాప్‌లను డిలీట్ చేసింది. అవసరమైన యాప్‌లను మాత్రమే అందిస్తుంది. Chrome, Gmail వంటి Google సొంత యాప్‌లు చాలానే ఉంటాయి.

Android Go ఎడిషన్‌లు సాధారణంగా 3GB వరకు RAM ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా ఉంటాయి. బ్లాగ్ పోస్ట్‌లో.. Android Go ద్వారా ఆధారితమైన 250 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ డివైజ్‌లు ఉన్నాయని Google పేర్కొంది. ఆన్‌లైన్‌లో యూజర్లు సేఫ్టీ కోసం Android Go-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు Google Play సిస్టమ్ అప్‌డేట్‌లను అందిస్తోంది. ఈ డివైజ్‌లు ప్రధాన Android రిలీజ్‌లో కీలకమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందవచ్చు. డివైజ్‌ల్లో స్టోరేజీతో తగినట్టుగా కొత్త అప్‌డేట్స్ డెలివరీని అందిస్తుంది.

Google unveils Android 13 Go for budget smartphones with modest specifications

Google unveils Android 13 Go for budget smartphones with modest specifications

ఆండ్రాయిడ్ 13 గో (Android 13 Go)తో, గూగుల్ తొలిసారిగా ‘Material You’ని కాంప్యాటబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తరిస్తోంది. గత ఏడాదిలో మొదటగా ఈ వెర్షన్ ప్రవేశపెట్టింది. మెటీరియల్ యు అనేది Google ఏకీకృత డిజైన్ లాంగ్వేజ్. ఈ ఫీచర్‌తో, ఫోన్ వాల్‌పేపర్ నుంచి కలర్లను మార్చుకోవచ్చు. యాప్ ఐకాన్లు, ఫాంట్‌లను మార్చుకోవచ్చు. ఈ అప్‌డేట్ Go-ఆధారిత డివైజ్‌ల కోసం నోటిఫికేషన్ పర్మిషన్స్, యాప్ లాంగ్వేజ్ ప్రాధాన్యతలు, మరిన్ని వంటి కొన్ని కీలకమైన Android 13 ఫీచర్‌లను కూడా అందిస్తుంది.

ఆండ్రాయిడ్ 13 గోతో రిలీజ్ కానున్న మరో ముఖ్య ఫీచర్ గూగుల్ డిస్కవర్ అందిస్తుంది. న్యూస్ స్టోరీలను చదివేందుకు యూజర్లకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా న్యూస్ స్టోరీ లిస్టు, ఇతర కంటెంట్‌ను క్యూరేట్ చేస్తుంది. యూజర్లు కంటెంట్‌ను పొందడానికి సెట్టింగ్‌ను డిసేబుల్ చేసే అవకాశం కూడా ఉంది. Google, ఇతర స్మార్ట్‌ఫోన్ OEMలు ఇంకా రోల్ అవుట్ టైమ్‌లైన్‌ను ప్రకటించలేదు. కంపెనీల నుంచి మరిన్ని వివరాలు రాబోయే వారాల్లో పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Foldable Phone : అద్భుతమైన ఫీచర్లతో గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ వస్తోంది.. పిక్సెల్ Tablet కూడా.. ఎప్పుడో తెలుసా?