Google : గూగుల్ ముందడుగు, లోకేషన్ టూల్ ఆధారంగా జీతాలు!

జీతభత్యాల విషయంలో గూగుల్ ఓ అడుగు ముందుకు వేసింది. కొత్తగా ఓ ‘టూల్ కిట్’ను ప్రవేశపెట్టింది. వర్క్ లోకేషన్ టూల్ గా పిలవబడనుంది.

Google : గూగుల్ ముందడుగు, లోకేషన్ టూల్ ఆధారంగా జీతాలు!

Google

Work Location Tool : గూగుల్ (Google)…సోషల్ మీడియాలో దిగ్గజం. ఈ సంస్థల్లో చాలా మంది పని చేస్తుంటారు. అయితే…కరోనా కాలంగా చాలా మంది ఆఫీసులకు వెళ్లకుండా..ఇంటి నుంచే (Work Form Home) పని చేస్తున్నారు. భద్రతా దృష్ట్యా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పించింది. ఈ వైరస్ కారణంగా..కుదేలుకాకుండా..సంస్థలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రధానంగా ఉద్యోగుల జీత భత్యాలపై దృష్టి సారిస్తున్నాయి. ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు, ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులకు ఇచ్చే జీతాల విషయంలో కంపెనీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకే రకమైన పే స్కేల్ ఉండకూడదని ఆయా సంస్థలు భావిస్తున్నాయని తెలుస్తోంది. జీతభత్యాల విషయంలో గూగుల్ ఓ అడుగు ముందుకు వేసింది. కొత్తగా ఓ ‘టూల్ కిట్’ను ప్రవేశపెట్టింది. వర్క్ లోకేషన్ టూల్ గా పిలవబడనుంది.

ఇక ఈ టూల్ కిట్ విషయానికి వస్తే..ఉద్యోగి ఉండే ప్రాంతం, అతను ఉండే ప్రాంతంలో కాస్ట్ ఆఫ్ లివింగ్, లోకల్ జాబ్, అక్కడున్న మార్కెట్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీని వల్ల..ఇంట్లో పని చేసే ఉద్యోగికి ఎంత జీతం ఇవ్వాలి ? అడ్డెస్ట్ చేసి చెబుతుంది. దీంతో వారికి ఆ జీతం సరిపోతుందా ? ఇంకా వారికి ఏం అందించాలనేది టూల్ కిట్ చెప్పనుంది. అయితే..ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలనేది వారికే వదిలేయనున్నారని సమాచారం.

గూగుల్ విషయానికి వస్తే…ప్రపంచ వ్యాప్తంగా లక్షన్నరకి పైగా ఉద్యోగులున్నట్లు సమాచారం. కరోనా కొంత తగ్గుముఖం పడుతుండడంతో 60 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే అవకాశాలున్నాయని గూగుల్ సంస్థ అంచనా వేస్తోంది. మరో 20 శాతం కొత్త ఆఫీసు లోకేషన్స్ లో, మరో 20 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ మీద పని చేసే అవకాశం ఉందని భావిస్తోంది.