Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!
మొబైల్ ఫోన్ల నుంచి అన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లపై సైబర్ నేరగాళ్లు కన్నేసి ఉంటారు. మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానంగా ఉందా? అయితే ఇలా చెక్ చేసుకోండి.. వెంటనే తొలగించుకోండి.

How To Know If Your Android Phone Has A Virus, How To Remove It
Android Phones Hack : అసలే కరోనా కాలం.. అందులోనూ సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న పరిస్థితి.. ఏది సురక్షితం కాదని గుర్తించుకోండి. ఎన్ని సెక్యూరిటీలు సెట్ చేసినా ఏదో లూప్ హోల్ సాయంతో హ్యాకర్లు డేటాను హ్యాక్ చేసేస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం.. కరోనా కారణంగా 600శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్టు డేటా వెల్లడించింది. స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్ వేర్, వార్మ్స్, ట్రోజన్స్, కంప్యూటర్ వైరస్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు.
హైబ్రిడ్ దాడుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్లు మెషన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా హైటెక్ సైబర్ దాడులకు పాల్పడుతున్నారంటూ హెచ్చరిస్తోంది. ఒక్క కంప్యూటర్ మాత్రమే కాదు.. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ప్రతి డివైజ్ ఏదో రకంగా సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ల నుంచి అన్ని డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైజ్ లపై సైబర్ నేరగాళ్లు కన్నేసి ఉంటారు. అందుకే వైరస్ ఎటాక్ లపై అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకీ సైబర్ నేరగాళ్ల బారినుంచి మీ స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Flipkart : నటుడికి చేదు అనుభవం.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ వచ్చింది
స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొన్ని ప్రత్యేకమైన వైరస్ మెయిల్స్ ద్వారా హ్యాక్ చేస్తుంటారు. ఆన్ లైన్ ఆఫర్ల పేరుతో పాప్ ఆప్ యాడ్స్ మీ ఫోన్లకు పంపిస్తుంటారు. ఈ పాప్ యాడ్స్ విషయంలో మొబైల్ యూజర్లు అలర్ట్ గా ఉండాలి. ఏదైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు అది ఎంతవరకు సురక్షితం అనేది తెలుసుకోవాలి. సైబర్ ఎటాక్ గురయ్యే ఛాన్స్ ఉందో లేదో తెలుసుకోవాలి. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేస్తే.. దాని సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు ఓసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలా లేదా నిర్ణయించుకోండి.
ఫోన్లో వైరస్ ఇలా గుర్తించండి.. :
మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్ ఉందనడానికి ఇదే సంకేతం.. ఫోన్ రీఛార్జ్ చేస్తే.. కట్ అయిపోతుంది. ఫోన్‌కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ అనుమతి లేకుండా యాప్స్‌ను కొనుగోలు చేసేస్తుంటారు. మీ ఫోన్‌కు కంటిన్యూగా యాడ్స్ వస్తున్నాయా? యాడ్ వేర్ మీ ఫోన్‌ను అటాక్ అయిందని నిర్ధారించుకోవాలి. ట్రోజన్, మాల్వేర్ ద్వారా స్మార్ట్ ఫోన్ స్పామ్ టెక్స్ట్ మెసేజ్‌లను మీ మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని మొబైల్ నెంబర్లకు ఆటో సెండ్ అవుతుంటాయి. మీ కాంటాక్ట్ ఫోల్డర్‌లోకి గుర్తు తెలియని వైరస్ అటాక్ అయిందని గుర్తించాలి. మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు బాగా ఉండదు. మీ ఫోన్‌లోకి వైరస్‌లు, మాల్వేర్‌లు కొత్త యాప్‌లను వాటంతట అవే డౌన్‌లోడ్ చేస్తుంటాయి. ఈ పనికిరాని యాప్స్ కారణంగా మీ డేటా వెంటనే అయిపోతుంటుంది. బ్యాటరీ లైఫ్ టైమ్ కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యలు మీ ఫోన్ లో ఉంటే మాత్రం కచ్చితంగా హ్యాకింగ్ లేదా వైరస్ అటాక్ అయి ఉందని నిర్ధారించుకోవాలి.
వైరస్ ఎలా తొలగించాలంటే? :
– మీ Android డివైజ్ నుంచి వైరస్‌లు, ఇతర మాల్వేర్‌లను ఇలా తొలగించుకోవచ్చు. మీ ఫోన్లో మాల్వేర్ ఉందని అనుమానం ఉంటే.. వెంటనే తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
– ముందుగా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. వెంటనే (Safe Mode) రీబూట్ చేయండి.
– పవర్ ఆఫ్ ఆప్షన్ యాక్సెస్ చేయడానికి పవర్ బటన్‌ని నొక్కండి.
– చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లు సేఫ్ మోడ్‌లో ఆప్షన్లతో వస్తాయి.
– గూగుల్ ప్రకారం.. మీ ఫోన్ ద్వారా సేఫ్ మోడ్ మారవచ్చు.
– ఇప్పుడు మీ ఫోన్ పవర్ బటన్‌ని నొక్కండి.
– స్ర్కీన్ పై యానిమేషన్ కనిపిస్తుంది..
– మీ ఫోన్ వాల్యూమ్ డౌన్ బటన్‌ని నొక్కి పట్టుకోండి.
– యానిమేషన్ ముగిసే వరకు అలాగే ఉంచండి.
– మీ ఫోన్ రీస్టార్ట్ (Restart) అవుతుంది.
– మీరు మీ స్క్రీన్ కిందిభాగంలో ‘Safe Mode’ చూస్తారు.
– అనుమానాస్పద యాప్స్ వెంటనే అన్‌ఇన్‌స్టాల్ (Uninstall) చేయండి.
– సెట్టింగ్‌లలో యాప్‌ను గుర్తించి దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి లేదా Force Stop నొక్కండి.
– ఇలా చేస్తే మీ ఫోన్లో మాల్వేర్ పూర్తిగా తొలగిపోదు. కానీ మీ డివైజ్ ఎఫెక్ట్ కాకుండా అడ్డుకోవచ్చు.
– మాల్వేర్‌ని మీ నెట్‌వర్క్‌లోని ఇతర డివైజ్ లకు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది.
– మీకు వైరస్ ఉందన్న అనుమానం ఉన్న ఇతర యాప్స్ చెక్ చేయండి..
– మాల్‌వేర్ ద్వారా కొన్ని యాప్‌లకు వైరస్ సోకే అవకాశం ఉంది.
– మీరు ఆ యాప్‌లను గుర్తించి వెంటనే వాటిని తొలగించండి.
– మీ ఫోన్‌లో ప్రీమియం మొబైల్ సెక్యూరిటీ యాంటీవైరస్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి.
Spying For Pakistan : వాట్సప్‌లో పాక్ మహిళతో పరిచయం….గూఢచర్యం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్
ఇలాంటి లింకులను క్లిక్ చేయొద్దు :
– మీ Android డివైజ్ ప్రొటెక్ట్ కోసం ప్రీమియం యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లో ఇన్ స్టాల్ చేసుకోండి.
– అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లు, సాఫ్ట్‌వేర్‌లను లేటెస్ట్ వెర్షన్‌లతో అప్‌డేట్ చేయండి.
– ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్ లు అనుమానాస్పద లేదా తెలియని లింక్‌లపై అసలే క్లిక్ చేయవద్దు.
– స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు లేదా పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించండి.
– అసురక్షితమైన Wi-Fi కనెక్షన్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దు.
– పబ్లిక్ Wi-Fi కి కనెక్ట్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ VPN ఎనేబుల్ చేసి ఉపయోగించండి.
– ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే అన్ని డివైజ్‌ల్లో ఎల్లప్పుడూ సైబర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉపయోగించండి.
– Google Play స్టోర్ నుంచి నమ్మదగిన యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి.
– మీరు యాప్ డెవలపర్‌లకు ఏమేవి యాక్సెస్ ఇస్తున్నారో తెలుసుకోండి..
– ఆయా యాప్స్‌లోని ఫైన్ ప్రింట్ అనుమతులను నిశితంగా చదవండి.
– మీ డివైజ్ వైరస్ అటాక్ అయ్యేంతవరకు వేచి చూడొద్దు.
– మీ PCలు, టాబ్లెట్‌లు, ఇతర Android డివైజ్ ల్లో మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్ స్టాల్ చేసుకోండి.
Apple Watch Series 7 : ఆపిల్ వాచ్ సేల్స్.. భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఫీచర్లు కిరాక్!