WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

వాట్సాప్‌లో మెసేజ్ లు పంపుతుంటారు. వాట్సాప్ మెసేజ్ పంపుతున్న సమయంలో పొరపాటున ఏదైనా మెసేజ్ డిలీట్ అయిందా? డిలీట్ అయినా మెసేజ్ తిరిగి పొందడం ఎలా..

WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

How To Recover Deleted Whatsapp Messages By Restoring From A Backup (1)

Deleted WhatsApp Messages : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మెసేజ్ లు పంపుతుంటారు. వాట్సాప్ మెసేజ్ పంపుతున్న సమయంలో పొరపాటున ఏదైనా మెసేజ్ డిలీట్ అయిందా? అరే.. డిలీట్ అయినా మెసేజ్ తిరిగి పొందడం ఎలా? అని ఆలోచిస్తున్నారా? వాట్సాప్ చాట్ లో డిలీట్ అయిన మెసేజ్ లను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. మెసేజ్ రికవరీ ఆప్షన్ ద్వారా సులభంగా డిలీటెడ్ మెసేజ్ లను తిరిగి పొందవచ్చు. వాట్సాప్ చాట్‌లో ఇప్పటికే Deleted For Everyone అనే ఫీచర్ అందుబాటులో ఉంది.

ఈ ఫీచర్ ద్వారా మీరు ఎవరికైనా పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. అదే మీరు డిలీట్ చేసిన మెసేజ్ కూడా తిరిగి పొందే వీలుంది. వాట్సాప్ యాప్‌లో రెండు రకాల బ్యాకప్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఫోన్ మెమెరీ (Phone Memory), రెండోవది క్లౌడ్ (Cloud). మీ ఫోన్ కోల్పోయినప్పటికీ కూడా మీ వాట్సాప్ చాట్ డేటా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. అందులో నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ చాట్ తిరిగి రికవరీ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్లో రికవరీ ఎలానంటే? :
మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే.. వాట్సాప్ అకౌంట్లో ఏదైనా చాట్ పొరపాటున డిలీట్ చేస్తే.. అది తిరిగి పొందవచ్చు. అందుకు మీరు మీ ఫోన్ యాప్ లో Backup ఆప్షన్ సెట్ చేసి ఉండాలి. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్ మీ File Manager లోకి వెళ్లాలి. అక్కడ Internal Storage ఓపెన్ చేయాలి. అక్కడ Android అనే ఆప్షన్ నొక్కాలి. ఆ తర్వాత మీడియా ఫైల్స్ పై క్లిక్ చేయాలి. అందులో మీకు Whatsapp అనే ఫోల్డర్ కనిపిస్తుంది. అందులో Database అనే ఫోల్డర్ ఓపెన్ చేయాలి. మీకు msgstore-YYY-MM-DD.1.db.crypt14 నుంచి msgstore.db.crypt14గా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్‌ను Uninstall చేసి మళ్లీ Whatsapp రీఇన్ స్టాల్ చేయాలి.

క్లౌడ్ స్టోరేజీ నుంచి ఇలా  :
పొరపాటున మీరు వాట్సాప్ నుంచి  చాట్ డిలీట్ చేస్తే.. వెంటనే వాట్సాప్ నుంచి  బయటకు వచ్చేయండి.  వాట్సాప్ Unistall చేయండి. ఆ తర్వాత రీ-ఇన్‌స్టాల్ చేయండి.  ఆ తర్వాత చాట్ బ్యాకప్ రీస్టోర్ చేయంటారా? అని పాప్ అప్ వస్తుంది. మీరు Restoreపై క్లిక్ చేయాలి. మీరు డిలీట్ చేసిన చాట్ ఫోన్‌లో కనిపిస్తుంది. ఇలా డిలీట్ అయిన చాట్ రికవరీ చేసుకోవచ్చు.  మీ ఫోన్ చాట్ బ్యాకప్ Enable చేసి ఉంటేనే రికవరీ చేయడం సాధ్యం. చాట్ బ్యాకప్ ఆప్షన్ ఎనేబుల్ చేయకపోతే.. డిలీట్ చేసిన చాట్ తిరిగిపొందలేరు. వాట్సాప్ అకౌంట్లో Backup ఆప్షన్ మాత్రం ఎనేబల్ చేశారా లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఈ Backup ఆప్షన్ Enable అయి ఉంటేనే వాట్సాప్ చాట్ డేటా ఫోన్, క్లౌడ్ స్టోరేజీలో స్టోర్ అవుతుందని గుర్తించుకోండి.

Google Drive బ్యాకప్ ఇలా :
– మీ Whatsapp Unistall చేసి.. Reinstall చేయండి.
– వాట్సాప్ ఓపెన్ చేసి.. మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోండి.
– Restore బటన్‌పై Tap చేయండి.
– Next బటన్ ఎంచుకోండి.
అంతే.. ఇన్ స్టాలేషన్ పూర్తి కాగానే మీ చాట్ మొత్తం పాప్ అప్ మాదిరిగా కనిపిస్తుంది. అప్పడు వాట్సాప్ మీ మీడియా ఫైల్స్ అన్నింటిని రీస్టోర్ చేయడం ప్రారంభిస్తుంది.
Read Also :  Elon Musk : నా దగ్గర డబ్బుల్లేవు.. షేర్లు అమ్మేస్తున్నాను.. ఎలన్‌ మస్క్‌ ట్వీట్!