Elon Musk : నా దగ్గర డబ్బుల్లేవు.. షేర్లు అమ్మేస్తున్నాను.. ఎలన్‌ మస్క్‌ ట్వీట్!

ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. రెండు రోజుల్లోనే 50 బిలియన్ డాలర్లు (రూ.3.71 లక్షల కోట్లు) నష్టాపోయాడు. అంతే.. మస్క్ ఆస్తి కొవ్వొత్తిలా కరిగిపోయింది.

Elon Musk : నా దగ్గర డబ్బుల్లేవు.. షేర్లు అమ్మేస్తున్నాను.. ఎలన్‌ మస్క్‌ ట్వీట్!

Elon Musk

Elon Musk : ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. రెండు రోజుల్లోనే 50 బిలియన్ డాలర్లు (రూ.3.71 లక్షల కోట్లు) నష్టాపోయాడు. అంతే.. మస్క్ ఆస్తి కొవ్వొత్తిలా కరిగిపోయింది. టెస్లా ఇంక్ షేర్లు కూడా వరుసగా రెండో రోజూ అమాంతం పడిపోయాయి. ఇక చేసేది ఏమిలేక మస్క్ చేతులేత్తేశాడు. నా దగ్గర డబ్బుల్లేవు.. షేర్లు అమ్మేయాలని అనుకుంటున్నాను.. మీరు ఏమంటారు? చెప్పండి అంటూ నెటిజన్ల అభిప్రాయాన్ని కోరుతూ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా స్టాక్‌లో 10 శాతం విక్రయించాలని భావిస్తున్నట్టు మస్క్ ఈ నెల 7న ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

మొన్నటివరకూ టెస్లా, స్పేస్ ఎక్స్ (SpaceX) కంపెనీలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఎలన్ మస్క్ సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. టెస్లా షేర్లు పడిపోవడంతో అమ్మేందుకు మస్క్ సిద్ధమయ్యారు. ఇటీవలే వాషింగ్టన్‌లో కొంతమంది డెమోక్రాట్లు ఎలన్ మస్క్ బిలియనీర్లపై పన్నులు పెంచాలని ఒత్తిడి పెంచసాగారు. బిలియనీర్లు స్టాక్స్‌ ధర పెరిగినప్పుడు షేర్లను విక్రయించకపోయినప్పటికీ పన్నులు చెల్లించాలని ప్రెజర్ పెట్టసాగారు. దాంతో టెస్లా స్టాక్‌లో 10శాతం విక్రయించాలని అనుకుంటున్నట్టు మస్క్ నెటిజన్ల మద్దతు కోరారు.


అలాగే మస్క్ సోదరుడు కింబాల్ ఈ పోల్ పెట్టడానికి ముందే వాటాలను విక్రయించాడనే వార్తలు వచ్చాయి. దాంతో పెట్టుబడుదారులంతా తమ డబ్బును వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి టెస్లా షేర్ ధరలు పడిపోతున్నాయి. నవంబర్ 9న 1,173.60 డాలర్లుగా నమోదైన టెస్లా షేర్ ధర ప్రస్తుతం 1,023.50 డాలర్లకు పడిపోయింది.
Read Also : Covid-19: ఐదు సింహాలకు కొవిడ్ పాజిటివ్ అంటించిన జూ సిబ్బంది