Android Speed : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి.. మీరే ఆశ్చర్యపోతారు..!

Android Speed : మీ స్మార్ట్‌ఫోన్ చాలా పాతదైందా? పర్ఫార్మెన్స్ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువే అనమాట.. మీ స్మార్ట్‌ఫోన్ డెడ్ స్లో అవుతున్నా.. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి.

Android Speed : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్పీడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి.. మీరే ఆశ్చర్యపోతారు..!

How To Speed Up Your Android Smartphone

Android Speed : మీ స్మార్ట్‌ఫోన్ చాలా పాతదైందా? పర్ఫార్మెన్స్ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువే అనమాట.. మీ స్మార్ట్‌ఫోన్ డెడ్ స్లో అవుతున్నా.. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి మీరు పాటిస్తే.. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా సులభంగా వినియోగించుకోవచ్చు. ఫోన్ డివైజ్ పాతగా అయ్యే కొద్ది ఆ డివైజ్ స్లో అవుతుంది. మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను స్పీడ్ పెంచుకోవాలంటే ఈ కొన్ని చిట్కాలను తప్పక ట్రై చేయాల్సిందే..

Android ఫోన్ పర్ఫార్మెన్ పెరగాలంటే? :
ఫ్యాక్టరీ రీసెట్.. ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అయితే.. ఒకే ఒక బెస్ట్ ఆప్షన్.. ఫోన్ రీసెట్ చేసుకోవాల్సిందే.. ఇలా చేయడం ద్వారా కొన్న కొత్తలో స్మార్ట్ ఫోన్ ఎలా ఉందో అదే ఫీచర్లను పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేసిన తర్వాత.. ఫోన్ పర్ఫార్మెన్స్ మీరు చూడవచ్చు. యాప్‌లు స్పీడ్ గా ఓపెన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ చాలా సున్నితంగా ఉంటుంది మీరు కొత్త డివైజ్ వాడుతున్నారనే ఫీలింగ్ అనిపిస్తుంది.

మీరు ముందుగా చేయాల్సింది ఒకటే.. మీ మొత్తం డేటాను బ్యాకప్ తీసుకోండి.. మీ డేటా ఎక్కడికి పోదు. రీస్టోర్ చేసే ప్రక్రియ కూడా చాలా సులభమే.. Google Photos‌లో అన్ని ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. కాంటాక్టులన్నీ Gmailలో సేవ్ అవుతాయి. మీరు మీ ఫోన్‌లో మీ Google అకౌంట్ లాగిన్ చేసినప్పుడు మీ కాంటాక్టులు ఆటోమాటిక్‌గా రీస్టోర్ అవుతాయి. మీ Google అకౌంట్లో ‘బ్యాకప్’ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. మీ యాప్‌లు, SMS మెసేజ్ డేటా, కాల్ హిస్టరీ కూడా మీ గూగుల్ అకౌంట్లో బ్యాకప్ అవుతాయి.

How To Speed Up Your Android Smartphone (2)

How To Speed Up Your Android Smartphone

మీరు ఫోన్‌ని సెటప్ చేస్తున్నప్పుడు మీ అకౌంట్ లాగిన్ అయినప్పుడు Google ఆటోమాటిక్‌గా కనెక్ట్ అవుతుంది. మీరు మీ పాత యాప్‌లన్నింటినీ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్ యూజర్లు.. తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి ముందు అన్ని సర్వీసుల ఐడి పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం డేటా ఆన్‌లైన్‌లో బ్యాకప్ అయిందో లేదో ముందుగా ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. మీరు మీ డేటాను కోల్పోకూడదనుకుంటే ఏదైనా డేటా డిలీట్ చేసే ముందు మీ బ్యాకప్ స్టేటస్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.

లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌గ్రేడ్ చేయండి :
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఔట్ డేటెడ్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అనేక బగ్‌లను పరిష్కరించడంలో సాయపడతాయి. ఒక విధంగా మీకు మెరుగైన పనితీరును అందిస్తుంది. మీరు కొన్నిసార్లు కొత్త ఫీచర్‌లను కూడా పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ మరింత మెరుగుపరుస్తుంది.

మీ స్టోరేజీ క్లీన్ చేయండి :
మీ ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను క్లీన్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే సిస్టమ్ స్లో అవుతుంది. సెట్టింగ్‌ల విభాగంలో మిగిలిన స్టోరేజీ చెక్ చేయాలి. స్టోరేజీ నిండిగా ఉంటే.. ఫోన్ స్లో అయ్యే ఛాన్స్ అవకాశం ఉంటుంది. మీరు మొత్తం స్టోరేజీ డేటాను యాప్‌ల క్యాచ్ డేటాను క్లీన్ చేయాలి. మీ ఫోన్ స్టోరేజీ నిండితే ఆందోళన పడొద్దు. స్టోరేజీ ఖాళీ చేయొచ్చు. కొన్ని అనవసరమైన యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. యాప్ Cache ఫైల్‌లను క్లియర్ చేయవచ్చు. యాప్‌పై నొక్కి పట్టండి> యాప్ డేటాపై నొక్కండి > స్టోరేజీ స్పేస్ > Cacheను క్లియర్ చేయండి. కొంత స్టోరేజ్ స్పేస్‌ని క్లీన్ చేయాలంటే.. పాత వీడియోలు లేదా ఫోటోలను డిలీట్ చేయవచ్చు.

యాప్‌ లైట్ వెర్షన్‌లే బెస్ట్ :
Instagram, Facebook, ఇతర భారీ యాప్‌ల లైట్ వెర్షన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి. లైట్ వెర్షన్‌లు తక్కువ డేటాను వినియోగిస్తాయి, వేగంగా లోడ్ అవుతాయి. తక్కువ ఇంటర్‌ఫేస్‌ని పొందుతారు, కానీ మీరు కొన్ని కెమెరా ఫీచర్‌లు, ఫిల్టర్‌లు మాత్రమే యాక్సస్ చేసుకోగలరు. ముఖ్యంగా.. మరొకటి గేమింగ్ యాప్స్ వెంటనే డిలీట్ చేసేయండి. లేదంటే మీ డేటాతో పాటు మీ ఫోన్ స్టోరేజీ స్పేస్‌ను కూడా వాడేస్తాయి.

Read Also : Android 13 beta : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్ చేయండిలా..!