Paytm Transfer Money : పేటీఎం నుంచి మీ సొంత బ్యాంకు అకౌంట్లకు ఎలా నగదు పంపుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!
Paytm Transfer Money : ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫారం పేటీఎం (Paytm) ద్వారా ఏ బ్యాంకు అకౌంట్ నుంచి అయినా సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు. మీ పేటీఎం అకౌంట్లో బ్యాంకు అకౌంట్లను యాడ్ చేయడం ద్వారా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు డబ్బులను బదిలీ చేసుకోవచ్చు.

How to transfer money within your own bank accounts in Paytm
Paytm Transfer Money : ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫారం పేటీఎం (Paytm) ద్వారా ఏ బ్యాంకు అకౌంట్ నుంచి అయినా సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు. మీ పేటీఎం అకౌంట్లో బ్యాంకు అకౌంట్లను యాడ్ చేయడం ద్వారా ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు డబ్బులను బదిలీ చేసుకోవచ్చు. Paytm అకౌంట్ ద్వారా నగదును బదిలీ చేయడమే కాదు.. త్వరిత చెల్లింపులు చేసుకోవచ్చు. మీ వ్యాలెట్‌లో నగదును యాడ్ చేయడానికి, బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి, లావాదేవీల హిస్టరీని వీక్షించడానికి అనుమతిస్తుంది.
అయితే మీ అకౌంట్లలో డబ్బును బదిలీ చేసుకునేందుకు Paytm మిమ్మల్ని అనుమతిస్తుంది. వినియోగదారులు తమకు కావలసినన్ని అకౌంట్లను Paytm యాప్‌తో లింక్ చేయవచ్చు. Paytmలోని అకౌంట్లలో డబ్బును బదిలీ చేసేందుకు మీరు ముందుగా యాప్‌లో మీ UPI అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ రెండు బ్యాంక్ అకౌంట్లను Paytm యాప్‌తో లింక్ చేయాలి. మీరు ఇప్పటికే ఉంటే.. Paytm లోని అకౌంట్లను నగదును బదిలీ చేసేందుకు ఈ కింది దశలను ఫాలో అవ్వండి.
* మీ స్మార్ట్‌ఫోన్‌లో Paytm యాప్‌ని ఓపెన్ చేయండి.
* హోమ్ స్క్రీన్‌పై ‘Send Money’ సెక్షన్ కిందికి స్క్రోల్ చేయండి
* ఈ విభాగం కింద ఉన్న ‘To Self’ ఎంపికపై Click చేయండి
* మీరు మీ అన్ని లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల లిస్టును చూస్తారు.
* మీరు డబ్బును బదిలీ చేయాలనుకుంటున్న అకౌంట్ ఎంచుకోండి.

How to transfer money within your own bank accounts in Paytm
* ఇప్పుడు, మీరు బదిలీ చేసే మొత్తాన్ని రిజిస్టర్ చేయండి
* ఆ తర్వాత, మీరు నగదు తొలగింపు/బదిలీ చేసే బ్యాంక్ అకౌంట్ ఎంచుకోండి
* ఇప్పుడు, ‘Pay’పై Click చేయండి.
* మీరు ఇప్పుడు మీ UPI PINని రిజిస్టర్ చేయమని ప్రాంప్ట్ చేయవచ్చు.
* UPI PIN రిజిస్టర్ చేసి, లావాదేవీని నిర్ధారించండి
ప్రత్యామ్నాయంగా, హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉన్న ‘To Bank A/c’ ఎంపికను Click చేయడం ద్వారా Self అకౌంట్‌కి నగదును పంపే ఆప్షన్ కూడా మీరు కనుగొనవచ్చు. ఆ తర్వాత మీరు ‘To Self’ ఎంచుకుని, మీరు నగదును పంపాలనుకుంటున్న బ్యాంకు అకౌంట్ ఎంచుకోవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..