Immortality : ఇక చావు అనేదే ఉండదు.. మరణం లేని జీవితం సాధ్యమే!

మనిషికి అమరత్వం సాధ్యమే అని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంజనీర్ మనిషికి త్వరలో అమరత్వం లభిస్తుందని అంటున్నారు. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు.

Immortality : ఇక చావు అనేదే ఉండదు.. మరణం లేని జీవితం సాధ్యమే!

immortality

Immortality : సృష్టిలో పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు.. అలాగే భూమిపై పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. అయితే పుట్టిన మనిషి చావాల్సిందేనా!.. మరణించకుండా ఉండటం సాధ్యం కాదా?.. మానవుడు ఎల్లకాలం జీవించి ఉండలేడా? మనిషికి అమరత్వం సాధ్యమేనా? ఈ ప్రశ్న కొన్ని వందల ఏండ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలను ఒక్కచోట నిలువనీయలేదు. పుట్టిన మనిషి మరణించకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు మేధోమథనం చేశారు. శాస్త్రీయంగా మాత్రం మనిషికి అమరత్వం సాధ్యమని ఎవరూ చెప్పలేకపోయారు.

కానీ, మనిషికి అమరత్వం సాధ్యమే అని తెలుస్తోంది.  తాజాగా ఓ ఇంజనీర్ మనిషికి త్వరలో అమరత్వం లభిస్తుందని అంటున్నారు. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు. 75 ఏళ్ల గూగుల్ మాజీ ఇంజనీర్ రే కర్జ వీల్. ఆయన 147 అంచనాలు వేయగా ఇందులో 86శాతం నిజం కావటంతో ఇప్పుడు అమరత్వం వాదనకు ఎక్కడలేని ప్రాధాన్యం సంతరించుకుంది.

Mauro Morandi: మనిషి కనిపించకుండా 33ఏళ్ల పాటు అడవిలో గడిపిన 82ఏళ్ల వ్యక్తి కొత్త జీవితం

జెనెటిక్స్, నానోటెక్నాలజీ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలతో మరో ఏడేళ్లల్లోనే మనిషికి అమరత్వం సాధ్యమవుతుందని తన యూట్యూబ్ ఛానెల్ అడాజియోలో పోస్ట్ చేసిన వీడియోలో రే కర్జ వీల్ పేర్కొన్నారు. వయసును రివర్స్ చేయగలిగే నానోబోట్లను నానోటెక్నాలజీ, రోబోటిక్స్ అభివృద్ధి చేస్తాయని, కణజాలాలను పునరుద్ధరిస్తాయని, రోగ నిరోధక శక్తిని కల్పిస్తాయని అంచనా వేశారు. వయసు మీద పడకుండా చేసే ఈ నానోబోట్లతో మనిషికి అమరత్వం సాధ్యం అవుతుందని ఆయన బలంగా చెబుతున్నారు.

గతంలో కర్జ్ వీల్ అంచనాలు నిజమయ్యాయి. తనను తాను భవిష్యత్తువాదిగా చెప్పుకునే కర్జ్ వీల్ గతంలో ఇలాగే వేసిన పలు అంచనాలు నిజమయ్యాయి. 2000 సంవత్సరం నాటికి ప్రపంచ అత్యుత్తమ చెస్ ప్లేయర్ ను కంప్యూటర్ ఓడించగలదని 1990 లో రే కర్జ్ వీల్ అంచనా వేయగా అది 1997లో నిజం అయింది. 2023 నాటికి వెయ్యి డాలర్ల విలువైన ల్యాప్ టాప్ కు మనుషుల మెదడుకు ఉన్నంత శక్తిసామర్థ్యాలు ఉంటాయని కర్జ్ వీల్ 1999లో అంచనా వేశారు.

Scientist About Death: చావు అనేది లేదు.. స్పృహ కోల్పోతామంతే అంటున్న సైంటిస్ట్

2010 నాటికి ప్రపంచమంతా హై బ్యాండ్ విడ్త్ వైర్ లెస్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని చాలా ఏళ్ల క్రితమే రే చెప్పారు. టెక్నాలజీకి సంబంధించి కర్జ్ వీల్ అంచనాలు చాలా వరకు నిజమవ్వడంతో ఆయన మాటకు ప్రాధాన్యత ఏర్పడింది, నమ్మకం పెరిగింది. దీంతో ఇప్పుడు మనిషికి చావు ఉండదనే ఆయన అంచనాపై అందరి దృష్టి పడింది. అయితే, నిజంగా మనిషికి అమరత్వం సాధ్యమవుతుందా? చనిపోకుండా ఎల్లకాలం జీవిస్తాడా? ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి మరి.