ట్విట్టర్‌కు పోటీగా ఇండియన్ ‘కూ’ యాప్.. ఫీచర్లు ఏంటి? డౌన్‌లోడ్ ఎలానంటే?

ట్విట్టర్‌కు పోటీగా ఇండియన్ ‘కూ’ యాప్.. ఫీచర్లు ఏంటి? డౌన్‌లోడ్ ఎలానంటే?

Indian Alternative to Twitter – Koo App : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ టెక్నాలజీతో ఇండియన్ కొత్త యాప్ వచ్చేసింది. అదే.. కూ (Koo) యాప్.. ఆత్మనిర్భార్ భారత్‌లో భాగంగా ట్విట్టర్ మాదిరి మైక్రో బ్లాగింగ్ వెబ్ సైటును రూపొందించారు. భారతీయ భాషల్లో ఈ కూ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్‌లలో ఉచితంగా అందుబాటులో ఉంది. వెబ్ పేజీ వెర్షన్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు. 2020 ఆత్మనిర్భార్ భారత్ యాప్ లక్ష్యంలో భాగంగా కూ యాప్ ఆవిష్కరణ జరిగింది. ఇప్పటికే ఈ కూ యాప్ లో రాజకీయ ప్రముఖులు చేరారు.

‘కూ’ అంటే ఏంటి? :
కూ.. అనేది ట్విట్టర్ మాదిరిగానే మైక్రో బ్లాగింగ్ సర్వీసు. కో ఫౌండర్, సీఈఓ అయిన అప్రమేయ రాధాక్రిష్ణ ఈ యాప్ ను డెవలప్ చేశారు. 2020 మార్చిలోనే లాంచ్ చేశారు. డిజిటల్ ఇండియా ఆత్మనిర్భార్ భారత్ ఛాలెంజ్ ఎంపిక చేసిన బెస్ట్ ఇండియన్ యాప్స్ లో ఇదొకటి. స్థానిక భాషల్లోనే యూజర్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరచేలా డిజైన్ చేశారు. భారతదేశంలో కేవలం 10 శాతం మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడేవారు ఉన్నారు. దాదాపు ఒక మిలియన్ మంది భారతీయులకు ఇంగ్లీష్ తెలియదు. దేశంలోని 100 భాషల వరకు మాట్లాడేవారు ఉన్నారు. అందరికి అర్థమయ్యేలా ఉండేందుకు వీలుగా ఈ యాప్ డిజైన్ చేయడం జరిగింది. భారతీయులు ఎవరైనా తమ మాతృభాషను ఎంచుకుని యాక్సస్ చేసుకోవచ్చు.

‘కూ’ ఎందుకిలా ట్రెండింగ్? :
ఇటీవలే కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.. తాను స్వదేశీ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ పాం ‘కూ’యాప్ లో చేరుతున్నానంటూ ట్వీట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వంతో ట్విట్టర్ మధ్య ఒప్పందం విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కూ యాప్ ఫుల్ పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్న 1000 ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేయమని ప్రభుత్వం సూచించినప్పటికీ ట్విట్టర్ అంగీకరించలేదు. అప్పటినుంచి దేశీ కూ యాప్ ఫుల్ ట్రెండ్ అవుతోంది.

కూ యాప్ డౌన్ లోడింగ్ ఎలా? :
కూ యాప్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని పేరు (Koo). భారతీయ భాషల్లోనే ఈ యాప్ అందుబాటులో ఉంది. బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందించే యాప్ గా యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. కూ వెబ్ సైట్ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు.

కూ యాప్ లో ఫీచర్లు ఏంటి? :
కూ యాప్ ఫీచర్లు కూడా ట్విట్టర్ మాదిరిగానే ఉన్నాయి. యూజర్లు ఎవరైనా ఈజీగా బ్రౌజ్ చేసుకోవచ్చు. మెసేజ్ లు, టెక్స్ట్, ఆడియో లేదా వీడియో ఫార్మాట్లలో న్యూస్ ఫీడ్ లో సెండ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. కన్నడ, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ భాష ఆప్షన్లు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. కూ యాప్ లో ట్వీట్ మాదిరిగా చేయాలంటే 400 వరకు క్యారెక్టర్లకు అనుమతి ఉంది. ప్రత్యేకించి లాంగ్వేజీ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. ఏ భాషలోనైనా సంబంధిత కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు.