Instagram User Location : ఇన్‌స్టాగ్రామ్ ఇదేం పని.. యూజర్ల లొకేషన్ ఫాలోవర్లకు షేర్ చేస్తుందట.. కంపెనీ సీఈఓ క్లారిటీ ఇచ్చాడుగా..!

Instagram Location Share : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తమ యూజర్లకు తెలియకుండా వారు ఎక్కడ ఉన్నారో లొకేషన్ చేరవేస్తుందట.. ఇంతకీ ఎవరికో తెలుసా? ఇన్‌స్టా యూజర్ల ఫాలోవర్లకు లొకేషన్ షేర్ చేస్తుందట..

Instagram User Location : ఇన్‌స్టాగ్రామ్ ఇదేం పని.. యూజర్ల లొకేషన్ ఫాలోవర్లకు షేర్ చేస్తుందట.. కంపెనీ సీఈఓ క్లారిటీ ఇచ్చాడుగా..!

Viral post claims Instagram shares users’ location with followers, CEO Adam Mosseri reacts

Instagram User Location : ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తమ యూజర్లకు తెలియకుండా వారు ఎక్కడ ఉన్నారో లొకేషన్ చేరవేస్తుందట.. ఇంతకీ ఎవరికో తెలుసా? ఇన్‌స్టా యూజర్ (Instagram Followers) ఫాలోవర్లకు లొకేషన్ షేర్ చేస్తుందట.. ఇన్‌స్టాగ్రామ్ (Instagram User Location) మీ లొకేషన్‌ను మీ ఫాలోవర్లతో షేర్ చేస్తుందని పేర్కొంటూ వైరల్ పోస్ట్ (Viral Post) ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవలి ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ iOS డివైజ్‌ల్లో Instagram యాప్ ద్వారా యూజర్ల కచ్చితమైన లొకేషన్ కనుగొనేందుకు ఇన్‌స్టా ఫాలోవర్లకు అనుమతిస్తుంది పోస్ట్ పేర్కొంది.

ఈ ఫీచర్ ద్వారా యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని, సైబర్ నేరగాళ్లు యూజర్ల లొకేషన్ కనుగొని వారి ఇంట్లోకి చొరబడే ప్రమాదం లేకపోలేదని పోస్టు పేర్కొంది. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై ఇన్‌స్టాగ్రామ్ (Instagram CEO Adam Mosseri) ఆడమ్ మోస్సేరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల లొకేషన్ షేర్ చేయడాన్ని మొస్సేరి తీవ్రంగా ఖండించారు.

Viral post claims Instagram shares users’ location with followers, CEO Adam Mosseri reacts

Viral post claims Instagram shares users’ location with followers, CEO Adam Mosseri reacts

ఇన్ స్టాగ్రామ్‌లో యూజర్లకు క్లారిటీ ఇచ్చేందుకు ఈ విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. లొకేషన్ సర్వీసులు అనేది మీ ఫోన్‌లో సెట్ చేసినది మాత్రమే.. Instagram నుంచి వచ్చిన కొత్త ఫీచర్ కాదని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఈ కొత్త ఫీచర్ లొకేషన్ ట్యాగ్‌లకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ ఎప్పుడూ కూడా యూజర్ల లొకేషన్ ఇతర యూజర్లతో షేర్ చేయదని ఆయన అన్నారు.

ఫోటో షేరింగ్ యాప్ లొకేషన్ ట్యాగ్‌లు (APP Location Tags), మ్యాప్స్ ఫీచర్‌ల (Location Map Features) కోసం కచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగిస్తుందని Instagram అధికారిక అకౌంట్ షేర్ చేసింది. యూజర్లు తమ డివైజ్ సెట్టింగ్‌ల ద్వారా లొకేషన్ సర్వీసులను కంట్రోల్ చేయవచ్చునని సీఈఓ మోస్సేరీ స్పష్టం చేశారు. ఆ డేటాను షేర్ చేయాలనుకుంటే వారి పోస్ట్‌లలో లొకేషన్ ట్యాగ్ చేయవచ్చునని పోస్టులో ఉంది.

Viral post claims Instagram shares users’ location with followers, CEO Adam Mosseri reacts

Viral post claims Instagram shares users’ location with followers, CEO Adam Mosseri reacts

కొన్ని రోజుల క్రితమే.. ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌పర్ట్, బిజినెస్ కోచ్ మయానిచోల్ (Myanichol) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, యాప్ యూజర్‌ల లొకేషన్‌ను ఎలా షేర్ చేస్తుందనే దానిపై అనేక పోస్ట్‌లను షేర్ చేశారు. ఇటీవలి iOS అప్‌డేట్ Instagram నుంచి మీ కరెంట్ లొకేషన్ కనుగొనేందుకు యూజర్లకు అనుమతిస్తుందని యూజర్ తెలిపాడు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో లొకేషన్ ట్యాగ్‌ను షేర్ చేస్తే.. అది మీ ఖచ్చితమైన లొకేషన్, సాధారణ లొకేషన్‌ను చూపిస్తుందని తెలిపారు. మీ ఐఫోన్‌లో కరెంట్ లొకేషన్‌ను ఆఫ్ చేయాలని యూజర్లకు సూచించారు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం.. యూజర్లు తమ (precise location)ని షేర్ చేయరు. కానీ, మీరు మీ కంటెంట్‌లో షేర్ చేసేందుకు ట్యాగ్ చేసినప్పుడు మీ లొకేషన్ కూడా షేర్ అవుతుంది. అప్పుడు మీ లొకేషన్ కూడా ట్రాక్ అవుతుంది. అందుకే యూజర్ల తమ లొకేషన్ ఆఫ్ చేసుకోవాలని సూచించారు. ఈ సెట్టింగ్ ద్వారా ఆన్‌లైన్ సేఫ్టీపై ఎంతవరకు ప్రభావం పడుతుంది అనేది యూజర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కంపెనీ సీఈఓ తెలిపారు.

Read Also : Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో వయస్సు వెరిఫికేషన్‌కు మూడు ఆప్షన్లు.. సెల్ఫీ వీడియో పంపాల్సిందే!