iOS Devices Freeze : ఆపిల్ iOS డివైజ్‌ల్లో బగ్.. హోంకిట్ కనెక్ట్ చేస్తే క్రాష్.. జాగ్రత్త!

ఆపిల్ ఐఫోన్ యూజర్లు.. మీ ఫోన్ పనిచేస్తుందా? ఓసారి చెక్ చేసుకోండి.. ఐఓఎస్ ఆధారిత ఫోన్లు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆపిల్ ప్రొడక్టుల్లో బగ్ కారణంగా ఈ కొత్త సమస్య వచ్చి పడింది.

iOS Devices Freeze : ఆపిల్ iOS డివైజ్‌ల్లో బగ్.. హోంకిట్ కనెక్ట్ చేస్తే క్రాష్.. జాగ్రత్త!

Ios Devices Can Freeze, Crash Due To A Homekit Vulnerability

iOS Devices Freeze : ఆపిల్ ఐఫోన్ యూజర్లు మీ ఫోన్ జాగ్రత్త.. హోంకిట్లతో కనెక్ట్ చేస్తున్నారా? ఓసారి చెక్ చేసుకోండి.. ఐఓఎస్ ఆధారిత ఫోన్లు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆపిల్ ప్రొడక్టుల్లో బగ్ కారణంగా ఈ కొత్త సమస్య వచ్చి పడింది. దీని కారణంగా ఆపిల్ ఉత్పత్తులు ఒక్కసారిగా ఫ్రీజ్‌ లేదా క్రాష్‌ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు టెక్ నిపుణులు. దీని అంతటికి కారణం ఒకటే.. HomiKit.. ఇందులోని టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఆపిల్ ప్రొడక్టులను పనిచేయకుండా అడ్డుకుంటోందని సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు వెల్లడించారు. ఆపిల్ కంపెనీకి ఈ సమస్య గురించి ముందే తెలుసనని అన్నారు. 2022లోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ బగ్ ఫిక్స్ చేయలేదు. iOS 14.7 ప్రారంభ వెర్షన్ నుంచి.. లేటెస్ట్ ఐఓఎస్ యూజర్ల ఫోన్లలోనూ హోంకిట్ ప్రభావం ఉండే అవకాశం ఉందని ప్రముఖ టెక్‌ నిపుణుడు ట్రెవర్ స్పినియోలాస్ వెల్లడించారు.

హోమ్‌కిట్‌ కారణంగా ఐఫోన్‌, ఐప్యాడ్స్‌ అసలే పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. 2021 ఆగస్టు 10న హోమ్‌కిట్‌ బగ్ సమస్య ఉందని రీసెర్చర్ ట్రెవర్‌ గుర్తించాడు. ఇప్పటికే ఈ సమస్యపై యాపిల్‌కు కూడా నివేదించినట్టు తెలుస్తోంది. ఆపిల్ ఈ సమస్యలను 2022లోపు ఫిక్స్ చేస్తుందని ప్రకటించింది. రీసెర్చర్ ప్రకారం.. ఆపిల్ యాప్ పేరుకు లిమిట్ సెట్ చేసింది కంపెనీ. అయితే iOS 15.1 హోంకిట్ డివైజ్‌లో కూడా సెట్ చేసుకోవచ్చు. హోం కిట్ డివైజ్‌ల్లో ఒకదాని పేరు మార్చిన తర్వాత దానిపై కొంతవరకు ప్రభావం తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ యాప్ ద్వారా హ్యాకర్లు సులభంగా హోంకిట్ పేరు మార్చేచే అవకాశం ఉందంటున్నారు.

ఇంతకీ ఈ సమస్య నుంచి ఆపిల్ యూజర్లు తప్పించుకోవాలంటే హోమ్‌కిట్‌ డివైజ్‌ను ఇన్వైట్ చేయకూడదని ట్రెవర్‌ సూచించారు. దాదాపు 500,000 అక్షరాలు కలిగిన హోమ్‌కిట్ డివైజ్ కనెక్ట్ చేయడం ద్వారా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌ను ఫ్రీజింగ్ లేదా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉందని పరిశోధకుడు వివరించారు. కనెక్ట్ అయిన హోమ్‌కిట్ డివైజ్‌ల పేర్లను ఆపిల్ iCloudలో స్టోర్ చేస్తుంది. ఆపిల్ యూజర్లు iOS డివైజ్‌లను రీస్టోర్ చేసినప్పటికీ బగ్ ఫిక్స్ కాలేదని ట్రావెర్ గుర్తించారు. డివైజ్ రిస్టోర్ చేసిన తర్వాత గతంలో ఉపయోగించిన ఐక్లౌడ్‌లో సైన్ ఇన్ చేస్తే.. హోమ్ కిట్ యాప్ మాత్రం పనికిరాదని పరిశోధకుడు సూచనలు చేశారు.

Read Also : MERCEDES-BENZ : ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి కిమీ ప్రయాణం.. మెర్సిడెస్ బెంజ్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కారు