iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు!

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 సిరీస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్‌లో iPhone 12 సిరీస్‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.

iPhone 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు!

Iphone 12 Available With Big Discount

iPhone 12 Available With Big Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ 12 సిరీస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ (Flipkart)లో iPhone 12 సిరీస్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. సెప్టెంబర్ 14న ఆపిల్ ఈవెంట్ జరుగబోతోంది. అందులో iPhone 13 సిరీస్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈలోపే ఫ్లిప్ కార్ట్‌లో 128GB మోడల్ ఐఫోన్ 12 సిరీస్ అసలు ధర రూ.84,900 ఉండగా.. డిస్కౌంట్ ధరతో ఫ్లిప్ కార్ట్ లో రూ.71,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకంటే తక్కువ ధరకే ఐఫోన్ 12 సిరీస్ పొందాలంటే రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు.

Flipkart Axis Bank క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ కూడా అందిస్తోంది. మీరు ఎంచుకున్న కార్డులపై నెలకు రూ.12వేల నుంచి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆసక్తి గల కస్టమర్లు పరిమితమైన ఈ డిస్కౌంట్ ఆఫర్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
iPhone 13 : ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 13 సిరీస్ రిలీజ్‌ డేట్ ఫిక్స్..

iPhone 12 సిరీస్ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో 5 కలర్ల ఆప్షనలో లభిస్తోంది. ప్రస్తుతం 64GB మోడల్ రూ.66,999 (అసలు ధర రూ.70,900) లకే లభిస్తోంది. 256GB ఆప్షన్ మోడల్ రూ.81,999 (రూ.94,900)లకే పొందవచ్చు. ఆపిల్ కస్టమర్లు ఐఫోన్ 12 మినీ మోడల్ కూడా ట్రై చేయొచ్చు.

ఐఫోన్ 12 మోడల్ 6.0 అంగుళాల OLED స్ర్కీన్ ఆకర్షణీయంగా ఉంది. iPhone 12 ఫోన్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. రెండు 12MP కెమెరాలు బ్యాక్ సైడ్, 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ కలిగి ఉంది. మరో 12MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగే 4K వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. A14 Bionic Chipset 5G మోడమ్ తో వచ్చింది. ఆపిల్ అందించే అన్ని 12 సిరీస్ ల్లో MagSafe Wireless ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తోంది. అదనంగా ఆపిల్ ఐఫోన్లలో USB Type-C పోర్ట్ కూడా తీసుకొచ్చింది. మీ పాత USB-C ఛార్జర్ కూడా వాడుకోవచ్చు.
Apple : ఐఫోన్-13 విడుదలపై నెట్టింట రచ్చ.. ఆపిల్ మూఢనమ్మకాలను నమ్ముతుందా?