iPhone 14 Pro Models : ఆపిల్ నుంచి కొత్త అల్ట్రా వైడ్ కెమెరాలతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్.. ఆకాశంలో నక్షత్రాలను దగ్గరగా ఫొటోలు తీయొచ్చు..?!

iPhone 14 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్‌లో సరికొత్త మోడళ్లు రానున్నాయి. ఇప్పటికే ఉన్న ఐఫోన్ మోడళ్ల కన్నా అత్యంత ఖరీదైనవే.. అతి త్వరలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను కొద్ది రోజుల్లో ప్రకటించేందుకు రెడీ అవుతోంది.

iPhone 14 Pro Models : ఆపిల్ నుంచి కొత్త అల్ట్రా వైడ్ కెమెరాలతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్.. ఆకాశంలో నక్షత్రాలను దగ్గరగా ఫొటోలు తీయొచ్చు..?!

iPhone 14 Pro models could arrive with new ultra-wide cameras

iPhone 14 Pro Models : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్‌లో సరికొత్త మోడళ్లు రానున్నాయి. ఇప్పటికే ఉన్న ఐఫోన్ మోడళ్ల కన్నా అత్యంత ఖరీదైనవే.. అతి త్వరలో ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను కొద్ది రోజుల్లో ప్రకటించేందుకు రెడీ అవుతోంది. అందులోనూ లాంచ్ ఈవెంట్‌ కూడా దగ్గర పడుతోంది. ఇప్పటికే ఐఫోన్ 14 సిరీస్ మోడల్ ఫీచర్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో అనేక లీక్‌లు బయటకు వచ్చాయి. iPhone 14 Pro మోడల్‌లు శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ (satellite connectivity feature)తో రావచ్చని ఓ నివేదిక వెల్లడించింది.

ప్రముఖ విశ్లేషకుడు, మింగ్-చి కువో (Ming-Chi Kuo), iPhone 14 Pro, iPhone 14 Pro Max వంటి కొత్త అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో వస్తాయని భావిస్తున్నారు. ఇక ఐఫోన్ Pro Models ఫోన్లు.. 1.4µm పిక్సెల్‌లను క్యాప్చర్ చేసే కొత్త సెన్సార్‌లను కలిగి ఉన్నాయట.. అంతేకాదు.. డిటైల్డ్ షాట్‌, తక్కువ కాంతిలోనూ అద్భుతమైన ఫొటో క్వాలిటీని అందించగలదని అంటున్నారు. ఇప్పటికే ఉన్న iPhone 13 Pro వేరియంట్‌ల్లోనూ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను ఉపయోగించి 1.0µm పిక్సెల్‌లను మాత్రమే అందిస్తున్నాయి. సోనీ CMOS ఇమేజింగ్ సెన్సార్‌ను డివైజ్‌లు కూడా ఉంటాయని అంచనా.

iPhone 14 Pro models could arrive with new ultra-wide cameras

iPhone 14 Pro models could arrive with new ultra-wide cameras

కొత్త వాయిస్ కాయిల్ మోటార్ (VCM), కొత్త కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్‌తో రానున్నాయి. Minebea, Largan ద్వారా VCM ద్వారా రన్ అవుతుందని Kuo చెప్పారు. ప్రధాన కెమెరా మాడ్యూల్‌కు LG అనేక పార్టులను సప్లయ్ చేయొచ్చు. అయితే, ఈ పార్ట్స్ ఆపిల్‌కు భారీ మొత్తంలో ఖర్చు కానున్నాయి. ప్రస్తుత ఐఫోన్ మోడల్స్‌తో పోలిస్తే.. 70 శాతం ఎక్కువ ఖరీదు కానున్నాయి. వెనుక కెమెరా మాడ్యూల్‌లో 4-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ మోడల్ ఉపయోగించే 48-MP ప్రధాన కెమెరా కూడా ఉంది. కొత్త ఐఫోన్ 14 Pro మోడల్‌లు మెరుగైన కలర్ క్వాంటీటీ, అద్భుతమైన ఫొటోలను అందిస్తాయని భావిస్తున్నారు. ఫ్రంట్ కెమెరాలు కూడా మరిన్ని అప్‌గ్రేడ్‌తో రావొచ్చు. af/1.9 ఎపర్చర్‌తో ఆటో ఫోకస్‌కు సపోర్టును కలిగి ఉండవచ్చు. వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఐఫోన్‌లలో ఫిక్స్‌డ్ ఫోకస్ కెమెరాతో పోల్చితే.. అద్భుతమైన క్వాలిటీ ఫొటోలను పొందవచ్చు.

iPhone 14 Pro models could arrive with new ultra-wide cameras

iPhone 14 Pro models could arrive with new ultra-wide cameras

ఐఫోన్ 14 సిరీస్‌లో ఆస్ట్రోఫోటోగ్రఫీ మోడ్ కూడా ఉందట.. ఇప్పటికే ఆపిల్ ఈవెంట్ కోసం ఇన్విటేషన్లను పంపింది.. బ్యానర్‌లో స్పేస్ థీమ్ కూడా యాడ్ చేసింది. కొత్త ఐఫోన్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఆప్షన్ కాకుండా ఆస్ట్రోఫోటోగ్రఫీ ఫీచర్ కూడా ఉండవచ్చని సూచిస్తుంది. అదేగానీ నిజమని తేలితే.. iPhone 14 మోడల్ ఫోన్లతో చంద్రుడు లేదా నక్షత్రాలను ఫొటోలు తీయొచ్చు కానీ, ఈ ఫీచర్ వెంటనే అవుట్‌పుట్ ఇవ్వదట.. వాస్తవానికి, ఎక్స్‌పోజర్ సమయం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కెమెరా ఇంటర్నల్ ప్రాసెసింగ్ మొత్తం క్వాలిటీ ఫొటోలను అందించడానికి ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు.

Read Also : iPhone 13 Price Offer : వచ్చే వారమే ఐఫోన్ 14 వస్తోంది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇందులో ఏ ఫోన్ బెటర్ అంటే?