భూమి నిజంగానే వేగంగా తిరుగుతోందా? లీపు సెకను తీసివేయాల్సిందేనా? ఎందుకిలా చేయాలి?

భూమి నిజంగానే వేగంగా తిరుగుతోందా? లీపు సెకను తీసివేయాల్సిందేనా? ఎందుకిలా చేయాలి?

Steal A Leap Second Planet Earth Spins : భూమి తాను చుట్టూ తాను తిరుగుతుందని చిన్నప్పుడే మనం చదువుకున్నాం. భూమి తన కక్ష్యలోనే తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంటుంది. దీన్నే భూ భ్రమణం అని పిలుస్తారు. భూమి ఒక చుట్టూ తిరిగివస్తే ఒక భ్రమణం పూర్తి అయినట్టు. అంటే ఒక రోజు అని అర్థం. ఒక రోజుకు 24 గంటలు అని తెలుసు. సుమారు 4.6 బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడినప్పటి నుంచి భూమి భ్రమణం కొనసాగుతోంది. అయితే ఉన్నట్టుండి భూమి భ్రమణ వేగం ఎందుకో మారుతోంది. క్రమంగా భూమి వేగం పెరిగిపోతోంది.

రోజులు తొందరగా గడిచిపోతున్నాయి. గంటలు తగ్గిపోతున్నాయి. భూమి మునుపటి కంటే వేగంగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు సైతం ఆందోళన చెందుతున్నారు. భూమి తిరిగే వేగం పెరగడం వల్ల ఒక రోజు వ్యవధి తగ్గిపోతోందని గమనించారు. భూమికి ఏమైంది? ఎందుకిలా వేగంగా తిరుగుతోందనేది అర్థం కావడం లేదు. అసలేం జరుగుతుందో అర్థం చేసుకోనేందుకు, దాని సమయపాలనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు.

టైం కీపర్ల పనేంటి? :
భూమి తిరిగే వేగం ఆధారంగా సమయాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేయడం పిల్లల ఆట కాదంటున్నారు సైంటిస్టులు. వాస్తవానికి 1960 వరకు, సమయపాలన లోపం లేకుండా జరగలేదని అంటున్నారు. గత 50 ఏళ్లలోనే సైంటిస్టులు అణు గడియారాన్ని ఖచ్చితమైన సమయపాలన కోసం ఉపయోగిస్తున్నారు. అణు గడియారాలు సీసియం లేదా రుబిడియం వంటి అణువుల ప్రతిధ్వని పౌన:పున్యాలను మిల్లీసెకన్ల ఖచ్చితమైన పొడవుకు తీవ్ర ఖచ్చితత్వంతో ఉంచడానికి ఉపయోగిస్తాయి. ప్రపంచంలోని గడియారాలు సింకరైజ్ చేసిన కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC) అని పిలిచే ప్రాధమిక సమయ ప్రమాణాన్ని అనుసరిస్తున్నారు.

భారత టైం కీపర్ నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ డీకే అస్వాల్ చెప్పిన ప్రకారం.. UTC ఇంటర్నేషనల్ అటామిక్ టైమ్ (TAI) ను అనుసరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ల్యాబరేటరల్లో నిర్వహిస్తున్న దాదాపు 500 అత్యంత ఖచ్చితమైన అణు గడియారాలను కలుపుతుంది. వాటిలో న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో ఉన్నాయి. అణు గడియారాల కచ్చితత్వం మిలియన్ల ఏళ్ల కాలంలో అసాధారణమైనది. అందుకే భూమిపై ఒక రోజు వ్యవధిని ఖచ్చితంగా తెలియజేస్తుంది.

సాధారణం కంటే భూమి వేగంగా తిరుగుతోంది :
2020 ఏడాదిలో చాలా నెలలు లాక్‌డౌన్ ఉన్నందున రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి. ఇతర ఏడాదితో పోల్చితే ఇది ఎక్కువని అంటున్నారు. 2020లో భూమి వేగంగా తిరుగుతుందని సైంటిస్టులు చెప్పారు. దీనివల్ల రోజులు తక్కువగా ఉంటాయని అర్థం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1960 నుంచి రికార్డు చేసిన అతి తక్కువ రోజులలో 28 మాత్రమే 2020 ఏడాదిలోనే జరగడం విశేషం. 2020లో భూమి ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి 24 గంటల (86,400 సెకన్లు) కన్నా తక్కువ సమయం తీసుకుందని టైమ్‌కీపర్స్ రికార్డ్ సూచిస్తుంది. జూలై 19, 2020లో సాధారణ 86,400 సెకన్ల కన్నా 1.4602 మిల్లీసెకన్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 2020కి ముందు, జూలై 5, 2005న భూమి చుట్టూ తిరిగేందుకు 1.0516 మిల్లీసెకన్లు 86,400 సెకన్ల కన్నా తక్కువ సమయం తీసుకుంది. 2020లో ఈ రికార్డు కంటే 28 రోజులు తక్కువగా ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు.

లీపు సెకండ్ ఏంటి? :
భూమి వేగంగా తిరగడం వల్ల, రోజులు ఇప్పుడు సగటున 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉన్నాయని టైమ్ కీపర్స్ అంచనా వేస్తున్నారు. 2021 ఏడాదిలో భూమి వేగం 19 మిల్లీసెకన్ల వరకు పెరుగుతుందని సూచిస్తోంది. ఉపగ్రహాలపై. ఆకాశంలో సూర్యుడి స్థానం ఆధారంగా సమయం గడిచిపోతుంది. దీన్ని సరిదిద్దడానికి, సౌర సమయంతో సమయాన్ని ఎలా ఖచ్చితంగా ఉంచాలో ఆలోచిస్తున్నారు. భూమి నెమ్మదిగా లేదా వేగంగా తిరిగేటప్పుడు భర్తీ చేసేందుకు యాడ్ చేసినా లేదా తగ్గించిన లీప్ సెకన్లను సర్దుబాటు చేయొచ్చు.

ఇలా చేయడం ద్వారా యూనివర్శల్ టైం ఖచ్చితంగా ఉంచడం చేస్తారు.లీపు సెకన్లు రెండు రకాలుగా ఉంటాయి. పాజిటివ్.. సెకను యాడ్ చేస్తారు. సెకను వదిలేస్తే నెగటివ్ గా సూచిస్తుంది. ఇప్పటివరకు, పాజిటివ్ లీపు సెకన్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే భూమి దాని అక్షం మీద నెమ్మదిగా తిరుగుతోంది. చివరి పాజిటివ్ లీప్ సెకను డిసెంబర్ 31, 2016 న యాడ్ చేశారు. 1972 నుంచి ఇప్పటివరకు 27 లీప్ సెకన్లు యాడ్ చేశారు. ఆ తర్వాత తిరిగి జూలై 1, 2012 న, అదనపు లీప్ సెకండ్ యాడ్ చేయగా.. అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని వెబ్‌సైట్లు క్రాష్ అయినట్లు సమాచారం.

లీపు సెకను తగ్గించవచ్చా? :
ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (IERS) బాధ్యత ఏంటంటే.. పాజిటవ్ లేదా నెగటవ్ లీపు సెకను ఎప్పుడు చేర్చాలో నిర్ణయిస్తారు. డిసెంబర్ 2020లో ప్రపంచ అధికారిక సమయపాలనలో లీప్ సెకండ్ చేర్చినట్టు IERS నిర్ణయించింది. 50 ఏళ్లలో భూమి కంటే వేగంగా తిరుగుతోందని సూచిస్తుంది. భూమి భ్రమణం వేగవంతం అవుతుంటే.. ప్రపంచంలో మొదటి నెగటీవ్ లీపు సెకండ్‌ను భవిష్యత్తులో IERS ప్రకటించవచ్చు. ఇప్పటివరకు, రోజు తగ్గిపోతుంటే పూర్తి సెకను సెట్ చేయలేదు. కానీ భూమి వేగం రేటు పెరుగుతూ ఉంటే అది త్వరలో జరిగే అవకాశం ఉంది.

ఇది గానీ జరిగితే UTC నుంచి ఒక సెకండ్ తీసివేయాలని నిర్ణయించుకోవచ్చు. గతంలో లీప్ సెకన్లు మాత్రమే యాడ్ చేస్తూ వచ్చారు. అలా అయితే రికార్డులో ఇదే మొదటిసారి అవుతుంది. లీప్ సెకన్లు ఎల్లప్పుడూ జూన్ లేదా డిసెంబర్ చివరి రోజున సర్దుబాటు చేస్తారు. ఇప్పుడు, ఏదైనా జరిగితే, లీపు సెకనుకు అదనంగా వచ్చే తేదీ జూన్ 30, 2021న ఉంటుంది. భూమి ప్రస్తుత భ్రమణ రేటు వద్ద ఇది అసంభవం అంటున్నారు. కానీ భూమి ఎందుకు వేగంగా తిరుగుతోంది? అంటే భూమి వేగవంతమైన భ్రమణానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు.