Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. మీ ఫోన్‌లో జియో 5G ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?

Jio 5G Welcome Offer : రిలయన్స్ జియో (Reliance Jio) 5G దేశంలో ప్రధాన 4 నగరాల్లో అందుబాటులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు రిలయన్స్ జియో (Reliance Jio) అందుబాటులోకి రానుంది.

Jio 5G Welcome Offer : జియో 5G వెల్‌కమ్ ఆఫర్.. మీ ఫోన్‌లో జియో 5G ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale, why you should consider it

Jio 5G Welcome Offer : రిలయన్స్ జియో (Reliance Jio) 5G దేశంలో ప్రధాన 4 నగరాల్లో అందుబాటులోకి వస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు రిలయన్స్ జియో (Reliance Jio) అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (2022) ఈవెంట్‌లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ డిసెంబర్ 2023 నాటికి పాన్ ఇండియా జియో 5G అందుబాటులోకి వస్తుందని ధృవీకరించారు.

ఎయిర్‌టెల్ 5G సర్వీసులు (Airtel 5G Services) మార్చి 2024 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. Airtel 5G ప్లస్ సర్వీసులు కూడా 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో ప్రధానంగా 4 నగరాల్లో 5G సర్వీసులను ప్రారంభించిన వెంటనే.. Jio అర్హత కలిగిన యూజర్ల కోసం వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు జియో 5G ఏయే యూజర్లు అర్హులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale, why you should consider it

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale

5G ఫోన్‌ యూజర్లకు మాత్రమే.
4 నగరాల్లో (ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి) నివసించే యూజర్లకు మాత్రమే
రూ. 239, అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్లాన్‌లో జియో యూజర్లు మాత్రమే

Jio 5G వెల్‌కమ్ ఆఫర్ అంటే ఏంటి? :
Jio 5G వెల్‌కమ్ ఆఫర్ ప్రస్తుతం అర్హత కలిగిన 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫర్ కింద Jio 1gbps స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. వెల్‌కమ్ ఆఫర్ యూజర్లకు ఇన్వైట్ అందితేనే పనిచేస్తుందని గమనించాలి, అంటే.. ప్రతి ఒక్కరూ ఈ ఇన్విటేషన్ పొందలేరు. Jios హైస్పీడ్ 5G సర్వీసులకు యాక్సెస్ పొందలేరు.

Jio వెల్‌కమ్ ఆఫర్ ఇన్విటేషన్ ఎలా పొందాలి?
రిలయన్స్ జియో ఎలా పనిచేస్తుందనే దానిపై Jio అనేక వివరాలను వెల్లడించలేదు. TelecomTalk నుంచి వస్తున్న నివేదికలో వెల్‌కమ్ ఆఫర్ ఇన్విటేషన్ MyJio యాప్‌లో కనిపిస్తుందని సూచిస్తుంది. మీరు 5G ఫోన్‌ని కలిగి ఉండి.. అర్హత ఉన్న 4 నగరాల్లో ఒకదానిలో నివసిస్తుంటే.. మీకు ఇన్విటేషన్ వచ్చిందో లేదో చెక్ చేసేందుకు MyJio యాప్‌కి వెళ్లండి.

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale, why you should consider it

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale

జియో 5G ప్లాన్‌ల గురించి ఏంటి?
రిలయన్స్ జియో ఇంకా 5G ప్లాన్‌లను ప్రారంభించలేదు. వెల్‌కమ్ ఆఫర్ కింద.. కొత్త 5G ప్లాన్‌లు ప్రకటించే వరకు యూజర్లు 5Gని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. 5G సర్వీసులు రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాతే 5G ప్లాన్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ సందర్భంగా.. ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. జియో 5G ప్లాన్‌లు ప్రతి జియో యూజరుకు సరసమైన ధరకే అందుబాటులో ఉంటాయని చెప్పారు.

కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇప్పటికే Jio 5G సర్వీసులను అందిస్తున్నాయి. కొంతమంది ఫోన్ తయారీదారులు 5G సపోర్టెడ్ ఫోన్లలో OTA అప్‌డేట్‌ అందించలేదు. iPhone యూజర్లు కొంత సమయం వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఐఫోన్లలో 5G కనెక్టివిటీని పొందేందుకు టెలికాం ఆపరేటర్లు Appleతో కలిసి పనిచేస్తున్నారు. మీరు ఐఫోన్ 13 లేదా ఐఫోన్ 14 లేటెస్ట్ ఐఫోన్ యూజర్లలో ఒకరు అయినప్పటికీ, మీరు ప్రస్తుతం 5Gని ఉపయోగించలేరని గమనించాలి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio 5G Services : మీ ఫోన్‌లో జియో 5G సపోర్టు చేయడం లేదా? ఈ 3 తప్పులే కారణమని తెలుసా?