Jio AirFiber Launch Date : జియో ఎయిర్‌‌ఫైబర్ అంటే ఏంటి? లాంచ్ డేట్ ఎప్పుడు? ధర ఎంత? ఏయే బెనిఫిట్స్ పొందవచ్చు? పూర్తి వివరాలివే..!

Jio AirFiber Launch Date : రిలయన్స్ జియో సెప్టెంబర్ 19, 2023న భారత్‌లో హోం, ఆఫీసుల కోసం కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన జియో ఎయిర్‌ఫైబర్‌ని లాంచ్ చేయనుంది. ఈ సర్వీసులో సురక్షితమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం అదనపు బెనిఫిట్స్ అందించనుంది.

Jio AirFiber Launch Date : జియో ఎయిర్‌‌ఫైబర్ అంటే ఏంటి? లాంచ్ డేట్ ఎప్పుడు? ధర ఎంత? ఏయే బెనిఫిట్స్ పొందవచ్చు? పూర్తి వివరాలివే..!

Jio AirFiber Announced _ Launch date confirmed, price, availability

Jio AirFiber Launch Date : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో హోం, ఆఫీసుల కోసం కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసులను అందించడానికి రెడీ అవుతోంది. ఈరోజు (ఆగస్టు 28న) జరిగిన 2023 AGM సందర్భంగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా.. సెప్టెంబర్ 19, 2023 మంగళవారం రోజున భారత మార్కెట్లో జియో ఎయిర్‌ఫైబర్‌ (Jio AirFiber)ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్‌ను మొదటగా గత ఏడాది జరిగిన కంపెనీ 45వ AGMలో ప్రకటించారు. ఈ కొత్త సర్వీస్‌పై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ఎయిర్‌ఫైబర్‌తో వినియోగదారులు ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌ వంటి వేగంతో వైర్‌లెస్ ఇంటర్నెట్‌కు యాక్సస్ పొందుతారని ఆయన నొక్కిచెప్పారు. స్ట్రీమింగ్ వీడియో, గేమింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, హై బ్యాండ్‌విడ్త్‌తో అప్లికేషన్‌ల రేంజ్ ఉపయోగించడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఈ సర్వీసులో పేరంట్ కంట్రోల్స్, Wi-Fi 6కి సపోర్టు అందించే మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? :
జియో ఎయిర్‌ఫైబర్ అనేది జియో కొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసు. హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగిస్తుంది. జియో ప్రకారం.. AiFiber సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్‌ల వేగాన్ని అందిస్తుంది. వినియోగదారులు 1Gbps వరకు వేగాన్ని కూడా యాక్సెస్ చేయగలరు. ఇన్‌స్టాల్‌మెంట్ ప్రాసెస్ విషయానికొస్తే.. Jio AiFiber సర్వీసుకు కేవలం ప్లగ్ ఇన్ చేసి ఆన్ చేయడం మాత్రమే అని అధికారిక జియో వెబ్‌సైట్ వెల్లడించింది. మీరు ఈ సర్వీసును ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేయండి.. అంతే. మీరు ఇప్పుడు మీ ఇంట్లో పర్సనల్ Wi-Fi హాట్‌స్పాట్‌ని కలిగి ఉంటారు. జియో (Jio True 5G)ని ఉపయోగించి అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతుంది. JioAirFiberతో మీ ఇల్లు లేదా ఆఫీసును గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్‌కి త్వరగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Read Also : Reliance AGM 2023 Updates : రిలయన్స్ కొత్త నాయకత్వం.. వైదొలిగిన నీతా అంబానీ.. బోర్డు డైరెక్టర్లుగా ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ..!

జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ :
జియో గత ఏడాదిలో ఈ డివైజ్‌ను ఆవిష్కరించింది. 1.5 Gbps వరకు 5G స్పీడ్ అందిస్తుంది. వేగవంతమైన, విశ్వసనీయమైన Wi-Fi కవరేజీని అందించనుంది. Jio AirFiber ట్రూ 5Gని ఉపయోగిస్తుందని జియో తెలిపింది. ఈ సర్వీసు ఒక ఇల్లు లేదా ఆఫీసులో ఒకే అంతస్తులో 1,000 చదరపు అడుగుల వరకు కవర్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

జియో AirFiber బెనిఫిట్స్ ఇవే :
వేగవంతమైన ఇంటర్నెట్‌తో పాటు, సురక్షితమైన ఇంటర్నెట్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్ల కోసం జియో AirFiber ఇతర సర్వీసులను కూడా అందిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ తల్లిదండ్రుల కంట్రోలింగ్ టూల్స్ అందజేస్తుంది. జియో యూజర్లు తమ నెట్‌వర్క్‌లో యాక్సెస్ చేయగల కంటెంట్‌ని పరిమితం చేయడానికి అనుమతిస్తుంది. Wi-Fi 6 టెక్నాలజీని కూడా సపోర్టు ఇస్తుంది. డివైజ్‌లకు మెరుగైన, సమర్థవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. జియో AiFiber సర్వీసులో జియో సెట్-టాప్ బాక్స్‌తో ఏకీకృతం అవుతుంది.

వినియోగదారులు తమ హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని అదే నెట్‌వర్క్ ద్వారా టెలివిజన్ వ్యూతో కలపడానికి అనుమతిస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ ఒక యాప్ ద్వారా సులభమైన ఇన్‌స్టాలేషన్, నిర్వహణను కూడా అందిస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ సర్వీసులో వినియోగదారులు నిర్దిష్ట వెబ్‌సైట్‌లు లేదా డివైజ్‌లను బ్లాక్ చేయడం ద్వారా మరింత సురక్షితమైన అనుకూలమైన ఆన్‌లైన్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. తద్వారా వారి నెట్‌వర్క్‌పై కంట్రోల్ అందించగలదు.

జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంతంటే? :
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర డివైజ్‌ల కన్నా జియో AirFiber సర్వీస్ ధర 20 శాతం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. నివేదిక ప్రకారం.. ఈ డివైజ్ కొనుగోలుపై దాదాపు రూ. 6వేలు చెల్లించాల్సి ఉంటుంది.

Jio AirFiber Announced _ Launch date confirmed, price, availability

Jio AirFiber Announced _ Launch date confirmed, price, availability

జియో AirFiber, Jio Fiber మధ్య తేడా ఏంటి? :
Jio AirFiber, Jio Fiber రిలయన్స్ జియో నుంచి విభిన్నమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, టెక్నాలజీ, స్పీడ్, కవరేజ్, ఇన్‌స్టాలేషన్, ఖర్చు విషయంలో విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, జియో ఫైబర్ వైడ్ కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌లను ఉపయోగిస్తుంది. అయితే, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. మరోవైపు, రాబోయే జియో ఎయిర్‌ఫైబర్ పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్, డైరెక్ట్ సిగ్నల్ ద్వారా జియోకు హోమ్‌లు, వర్క్‌ప్లేస్‌లను కనెక్ట్ చేస్తుంది.

ఫైబర్ కేబుల్స్ ద్వారా కాకుండా జియో టవర్‌లతో లైన్-ఆఫ్-సైట్ మీద ఆధారపడి ఉంటుంది. స్పీడ్‌కు సంబంధించి.. జియో ఎయిర్‌ఫైబర్ 1.5Gbps వరకు ఆఫర్ చేస్తుంది. Jio Fiber 1Gbps కన్నా ఎక్కువగా ఉంటుంది. అయితే, ట్రూ జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ టవర్ సామీప్యతను బట్టి మారుతుంది. అదనంగా, జియో AirFiber ప్లగ్-అండ్-ప్లే, అయితే JioFiber ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్‌ను డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా Jio AirFiber మరింత అనుకూలంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

మరోవైపు.. Jio AirFiber పోటీగా Airtel, BSNL, ACT వంటి బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లకు బలమైన పోటీగా వస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ అనేది జియో సొంత 5G టెక్నాలజీపై ఆధారపడింది. SA (స్వతంత్ర) నిర్మాణంపై పనిచేస్తుంది. అంటే.. భారతీ ఎయిర్‌టెల్ NSA (నాన్-స్టాండలోన్) విధానం మాదిరిగా కాకుండా, ప్రస్తుతం ఉన్న 4G అవస్థాపన నుంచి స్వతంత్రంగా ఉంటుంది. ఈ వ్యత్యాసంతో స్పీడ్, విశ్వసనీయత రెండింటి పరంగా పోటీదారుల కన్నా ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుందని జియో పేర్కొంది.

Read Also : Vivo V29e Launch : కొత్త ఫోన్ కావాలా? రంగులు మార్చే ప్యానల్‌తో వివో V29e ఫోన్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?